ట్విస్టు: చ‌ర‌ణ్ దిమ్మ తిరిగే ట్రీట్

Last Updated on by

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌ `విన‌య విధేయ రామ‌` బాక్సాఫీస్ ఫెయిల్యూర్ పంపిణీదారుల్ని తీవ్రంగా ముంచిన సంగ‌తి తెలిసిందే. ఆ న‌ష్టాల్ని భ‌ర్తీ చేసేందుకు ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసింది యూనిట్. న‌ష్ట‌పోయిన పంపిణీదారులు, బ‌య్య‌ర్ల‌కు స‌గం మేర క‌ష్టం పంచుకోవాల‌ని దాన‌య్య – చ‌ర‌ణ్ టీమ్ నిర్ణ‌యించుకున్నారు. ఆ క్ర‌మంలోనే బోయ‌పాటి తో నిర్మాత వివాదం గురించి తెలిసిందే.

ఈ గొడ‌వ సద్ధుమ‌ణ‌గ‌క ముందే మ‌రొక ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రామ్ చ‌ర‌ణ్, దాన‌య్య ఒక్కొక్క‌రు రూ.5కోట్లు చొప్పున వెన‌క్కి ఇచ్చేందుకు రెడీ అయ్యారు. చ‌ర‌ణ్ ఏ రూపంలో ఆ డ‌బ్బును వెన‌క్కి ఇస్తున్నారు? అంటూ ఆస‌క్తిక‌రంగా ముచ్చ‌ట సాగుతోంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను పిలిచి ఓ మాట చెప్పార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న మూవీ రైట్స్ నుంచి ల‌బ్ధి పొందేట్టు తాను ఏర్పాట్లు చేస్తున్నాన‌ని మాటిచ్చార‌ట‌. అయితే చ‌ర‌ణ్ అస‌లు లాజిక్ మిస్స‌య్యారే అంటూ రివ‌ర్స్ పంచ్ లు ప‌డుతున్నాయి. చ‌ర‌ణ్ – దాన‌య్య ఈ న‌ష్టాల్లో వాటా పంచుకోవాల‌నుకుంటే ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న ఆర్ఆర్ఆర్ పంపిణీలో సాయం చేయొచ్చు క‌దా? అంటూ ప్ర‌శ్న లేవ‌నెత్తారు. పైగా త్రివిక్ర‌మ్ తో మెగాస్టార్ సినిమా వెంట‌నే సెట్స్ కెళ్లేది లేదు. సైరా రిలీజ‌వ్వాలి. ఆ త‌ర్వాత కొర‌టాల‌తో సినిమా పూర్త‌వ్వాలి. ఆన‌క త్రివిక్ర‌మ్ తో కూల్ గా క‌థ ఓకే చేసి ఆన్ లొకేష‌న్ వెళ్లేప్ప‌టికి ఇంకా మూడేళ్లు పైగానే ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే ఇప్ప‌టి న‌ష్టాన్ని అన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత భ‌ర్తీ చేయాల‌న్న ఆలోచ‌న స‌రైన‌దేనా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే చ‌ర‌ణ్ ఆ మాట అన్నారా లేదా? రూ.5కోట్లు ఎలా చెల్లిస్తున్నారు? అన్న‌దానికి అట్నుంచి స‌మాధానం రావాల్సి ఉంది. అప్ప‌టివ‌ర‌కూ ఇది ఉత్త‌ప్ర‌చార‌మేన‌ని భావించాల్సి ఉంటుంది.

User Comments