చ‌ర‌ణ్‌-దుల్కార్ మ‌ల్టీస్టార‌ర్‌?

Last Updated on by

ఆ ఇద్ద‌రు మెగా వార‌సులు. ఒక‌రు టాలీవుడ్ లో టాప్ హీరో. ఇంకొక‌రు మాలీవుడ్‌లో టాప్ హీరో. ఆ ఇద్ద‌రూ ఇరుగుపొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ బంతాడేస్తున్నారు. అన్నిచోట్లా అభిమానుల్ని పెంచుకుంటూ యూనివ‌ర్శ‌ల్ స్టార్లుగా వెలిగిపోతున్నారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రూ క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించేందుకు రెడీ అవుతున్నార‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. ఇటీవ‌లే ఈ ఇద్ద‌రూ క‌లిసి ఓచోట పార్టీ చేసుకున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ కావ‌డంతో ఈ కొత్త పుకార్ షికారు చేస్తోంది. మెగాస్టార్ న‌ట‌వార‌సుడిగా రామ్‌చ‌ర‌ణ్ టాలీవుడ్‌లో అగ్ర హీరోగా వెలుగుతున్నాడు. `రంగ‌స్థ‌లం` చిత్రంతో ది బెస్ట్ పెర్ఫామ‌ర్‌గా నిరూపించుకుని హుషారుగా ఉన్నాడు. అటు మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌ట‌వార‌సుడు దుల్కార్ స‌ల్మాన్ `మ‌హాన‌టి` చిత్రంలో జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌తో, ఇదివ‌ర‌కూ `ఓకే బంగారం`లో చాక్లెట్‌బోయ్ పాత్ర‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ ఇద్ద‌రికీ ఇరు భాష‌ల్లో క్రేజీగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి న‌టిస్తే బావుంటుంద‌ని ఇరువురు హీరోల‌ మెగా- మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మ‌ల‌యాళంలో బ‌న్నికి ఉన్న ఫ్యాన్స్ దృష్ట్యా చ‌ర‌ణ్ అక్క‌డ గ్రాఫ్ పెంచుకోవాల్సిన సంద‌ర్భ ం ఉంది.

ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ బోయ‌పాటి సినిమాతో బిజీ. మ‌రోవైపు ఎన్టీఆర్‌- జ‌క్క‌న్న‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌కు రెడీ అవుతున్నాడు. దుల్కార్ కెరీర్ ప‌రంగా అంతే బిజీగా ఉన్నాడు. అత‌డికి ప‌లు క్రేజీ చిత్రాలు క్యూలైన్‌లో ఉన్నాయి. ఆ క్ర‌మంలోనే ఈ కాంబినేష‌న్ వెంట‌నే కుద‌ర‌ద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే భ‌విష్య‌త్‌లో ఈ జోడీ క‌లిసి న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఒక‌వేళ ఇలా చేస్తే అది ఇటు తెలుగు మార్కెట్‌కి, అటు మ‌ల‌యాళ మార్కెట్‌కి క‌లిసొస్తుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. క్రేజీగా ఆ ప్ర‌య‌త్న ం నిజం కావాల‌నే ఆశిద్దాం.

User Comments