జ‌న‌సేనాని పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌?

Last Updated on by

రామ్‌చ‌ర‌ణ్ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌లో న‌టించ‌నున్నారా? అంటే అవున‌నే ఫిలింన‌గ‌ర్‌లో ముచ్చ‌ట సాగుతోంది. అందుకు స్టార్ డైరెక్ట‌ర్‌ పూరి జ‌గ‌న్నాథ్ అదిరిపోయే స్కెచ్ వేశాడ‌ని మాట్లాడుకుంటున్నారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ఫూర్తితో ఓ స్క్రిప్టుని పూరి రెడీ చేస్తున్నాడు. `మెహ‌బూబా` రిలీజైన వెంట‌నే ఇక ఈ ప‌నిలోనే ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ `ప్ర‌జారాజ్యం` కాంగ్రెస్‌లో వీలీనం అవ్వ‌డం న‌చ్చ‌ని ప‌వ‌న్‌.. త‌నే స్వ‌య‌గా `జ‌న‌సేన‌` పార్టీని స్థాపించి, అటుపై దానికి జ‌వ‌స‌త్వాలు తెచ్చిన వైనం.. అంత‌కంత‌కు ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర వ‌హిస్తూ ప‌వ‌న్ ఎదుగుతున్న తీరుపై పూరి సినిమా తీస్తాడ‌ట‌.

పైగా `మెహ‌బూబా`తో కాన్ఫిడెంట్‌గా హిట్ కొట్టి ట్రాక్‌లోకొస్తాన‌ని న‌మ్ముతున్న పూరి మెగా కాంపౌండ్ హీరోల‌కు క‌థ చెప్పి ఒప్పించ‌గ‌ల‌న‌ని న‌మ్ముతున్నాడ‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ కి స్క్రిప్టు వినిపిస్తాడు. అత‌డికి కుద‌ర‌క‌పోతే వ‌రుణ్‌తేజ్ కి చెబుతాడు. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు అయితే ఈ క‌థ‌కు సూట‌బుల్ అని పూరి న‌మ్ముతున్నాడ‌ట‌. అయితే చ‌ర‌ణ్ ఇప్ప‌టికే రాజ‌మౌళి, కొర‌టాల‌కు కాల్షీట్లు ఇచ్చేశాడు కాబట్టి అత‌డికి కుదర‌క‌పోవ‌చ్చు. ఆ క్ర‌మంలోనే వ‌రుణ్‌తేజ్ ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తాడ‌ట‌. అస‌లే ఎన్నిక‌ల హీట్ అంత‌కంత‌కు రాజుకుంటున్న ఈ వేళ ఇలాంటి సినిమాని ఎల‌క్ష‌న్ ముందు రిలీజ్ చేస్తే బంప‌ర్ హిట్ కొడుతుంద‌ని పూరి స్కెచ్ వేశాడ‌ట‌. అయితే ఇందులో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కాస్త ఆగి చూడాల్సిందే. `మెహ‌బూబా` రిలీజ్ ప్ర‌మోష‌న్స్‌లో ఏ విష‌యం పూరీనే ప్ర‌క‌టిస్తాడేమో?

User Comments