చ‌ర‌ణ్ మ్యాకోమ్యాన్ అవ‌తారం

Last Updated on by

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హార్డ్ వ‌ర్క్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. రెగ్యుల‌ర్ ఫిట్‌నెస్ ఫ్రీక్ గా అత‌డు టాలీవుడ్ హీరోల్లోనే స్పెష‌ల్ మ్యాన్ గా అల‌రిస్తుంటాడు. 6ప్యాక్ యాబ్స్.. బైసెప్స్, ట్రైసెప్ అంటూ అత‌డి రూపం వెన‌క ఎంతో క‌ఠిన‌మైన వ్యాయామాల హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది.

ఇటీవ‌లే రిలీజైన `విన‌య విధేయ రామ` కొత్త పోస్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అత‌డు `ఫ‌స్ట్ బ్ల‌డ్` ర్యాంబో(స్టాలోన్)లా ఉన్నాడంటూ పొగిడేశారంతా. తాజాగా ఉపాస‌న కొణిదెల నిర్వ‌హిస్తున్న `బీ పాజిటివ్` హెల్త్ మ్యాగ‌జైన్‌పై చ‌ర‌ణ్ క‌స‌ర‌త్తులు చేస్తున్న ఫోటోని ప్రింట్ చేశారు. ఈ ఫోటో అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. జిమ్‌లో డంబెల్స్ ఎత్తుతున్న మ్యాకో మ్యాన్ చ‌ర‌ణ్ ఫోటో సంథింగ్ స్పెష‌ల్ గా ఉంద‌న్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ ఈనెల 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. RRR ఆన్ సెట్స్ ఉంది. ఈ సినిమా 2020లో రిలీజ‌వుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

Also Read: VVR ట్రైల‌ర్: బై బ‌ర్తే డెత్‌ని గెలిచొచ్చా

User Comments