ట్రెండింగ్: భీమ్-రామ్ గెట్‌ రెడీ

Last Updated on by

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇప్ప‌టికే కొంత భాగం పూర్త‌యింది. అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో రెండు షెడ్యళ్ల‌ను.. ఉత్త‌ర భార‌తంలో మ‌రో షెడ్యూల్ పూర్తిచేసారు. గుజరాత్, మహారాష్ట్రా లోని కొన్ని ప్రదేశాలలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇక్క‌డ షూటింగ్ చేస్తుండ‌గానే క‌థానాయ‌కులిద్ద‌రికీ గాయాల‌య్యాయి. దీంతో షూటింగ్ కు విరామం ఇచ్చారు. ఆ గాయాల‌ను నుంచి కోలుకోవ‌డంతో రాజ‌మౌళి టీమ్ త‌దుప‌రి షెడ్యూల్ ను అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో ప్లాన్ చేసారుట‌.

ఇప్ప‌టికే నిర్మించిన ప్ర‌త్యేక సెట్ట‌ల‌లోనే ఏక‌ధాటిగా షూటింగ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్ లో చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ కూడా పాల్గొంటుందిట‌. ఇక్క‌డ షెడ్యూల్ పూర్త‌వ్వ‌గానే ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్ల‌నున్నట్లు స‌మాచారం. అటు ఎన్టీఆర్ కు హీరోయిన్ ను సెట్ చేసే ప‌నిలోనూ రాజ‌మౌళి బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ఎంపిక‌ ప్రేక్ష‌కుల‌కే వ‌దిలేసారు. వాళ్ల నుంచి వ‌చ్చిన మెజార్టీ టైటిల్స్ ను బ‌ట్టి యూనిట్ ఒక టైటిల్ ఖరారు చేయ‌నుంది. ఇందులో చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డి. వి. వి దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.