బాబాయ్ లా చ‌ర‌ణ్ క‌రుణిస్తాడా?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సైరా న‌ర‌సింహారెడ్డి విజ‌యోత్స‌వంతో నిర్మాత‌గా రెట్టించిన ఉత్సాహాంలో ఉన్నాడు. కుటుంబ స‌భ్యుల‌తో ఆ సంతోషాన్ని పంచుకుంటున్నాడు. రెండున్న‌రేళ్ల క‌ష్టానికి త‌గ్గ ఫ‌లిత ద‌క్కింద‌ని ధీమా చేసారు. ఈ ఉత్సాహాంలో ఉన్న చ‌ర‌ణ్ కోసం నేను వెయిట్ చేస్తున్నానంటూ నిర్మాత బండ్ల గ‌ణేష్ ఓ ట్వీట్ చేసాడు. లిటిల్ బాస్ తో సినిమా చేయ‌డం కోసం రెడీ గా ఉన్నా. చిన్న బాస్ ఎప్పుడు క‌రుణిస్తాడో అంటూ ఓ ట్వీట్ పెట్టాడు. మ‌రి ఈ ట్వీట్ పై చ‌ర‌ణ్ స్పందిస్తాడో లేదో చూడాలి.

మెగా ఫ్యామిలీ హీరోల‌తో బండ్ల గ‌ణేష్ కు మంచి అనుబంధం ఉది. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తీన్ మార్, గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాలు నిర్మించాడు. తీన్ మార్ ప్లాప్ అవ్వ‌డంతో ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ తో గ‌ణేష్ కి భారీ విజ‌యాన్ని అందించాడు. అటుపై రామ్ చ‌ర‌ణ్ తో గోవిందుడు అంద‌రివాడే నిర్మించాడు. కానీ ఆ సినిమా అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. మ‌రి ఇప్పుడు చ‌ర‌ణ్ బాబాయ్ త‌ర‌హాలో ఓ సినిమా చేసి గ‌ణేష్ కి హిట్టు ఇస్తాడా? లేక లైట్ తీసుకుంటాడా? అన్న‌ది చ‌ర‌ణ్ చేతుల్లోనే ఉంది.