కేసీఆర్ లాంచింగ్ కి ముందే ప్ర‌కంప‌న‌లు!

Chandrababu's Silence Driving Ram Gopal Varma Crazy 

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ జీవిత క‌థ ఆధారంగా `టైగ‌ర్ కేసీఆర్` టైటిల్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆ సినిమా పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ పాట‌ను వ‌ర్మ త‌న‌దైన శైలిలో పాడారు. మా భాష మీద నవ్వినావ్‌.. మా ముఖాల మీద ఊసినావ్‌.. మా బాడీల మీద నడిసినావ్‌ ఆంధ్రోడా.. వస్తున్నా.. వస్తున్నా.. నీ తాట తీయనీకి వస్తున్నా..’ అంటూ పాట వీడియోను షేర్ చేసారు. అంత‌కు ముందు బ్రిటిష్‌ ప్రభుత్వంపై శాంతియుతంగా పోరాడి గాంధీ స్వతంత్ర భారత్‌ను సాధించారు. అగ్రెసివ్‌ గాంధీ కేసీఆర్‌ ఆంధ్రా పెత్తందారులపై పోరాడి తెలంగాణ సాధించారు’ అని ట్వీట్ చేసారు.

దీంతో సినిమా ప్రారంభానికి ముందే వివాదాలు చేల‌రేగ‌డం ఖాయ‌మ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ర్టం విడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌కుడిగా కేసీఆర్ ను ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు చెప్పుకుంటారు. విడిపోయినా అన్న‌ద‌మ్ముల్లా క‌లిసే ఉందాం. ఒకే భాష క‌లిగిన రాష్ర్టాల్లా క‌లిసే ఉంటామంటూ చెప్పుకొచ్చిన క‌వ్వింపు మాట‌లను ట్వీట్ చేస్తూ షేర్ చయ‌డం మొద‌లు పెట్టారు. మ‌రి వ‌ర్మ మొద‌లు పెట్టిన ఈ బ‌యోపిక్ ఎంత‌టికి దారి తీస్తుందో చూడాలి.