రాంగోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలు గురించి చెప్పాల్సిన పనిలేదు. వాస్తవ సంఘటలను ఆధారంగా ఎంత అద్భుతమైన చిత్రాలు చేస్తాడో..బోల్డ్ కంటెంట్ ను బేస్ చేసుకునే అంతే వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తుంటాడు. జీఎస్టీ సినిమాతో ఎంతటి దుమారం రేపాడో తెలిసిందే. తాజాగా వర్మ అభిమానించే ఓ వీరాభిమాని వాస్తవ్ స్పెషల్ అనే ఓ సినిమా చేసాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల జరిగిన కొన్ని వివాదాస్పద కామెంట్లపై ఆయన మాట్లాడారు. బూతు సినిమాలపై పోరాటం చేస్తాం. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ -100లాంటి సినిమాల వల్ల అలాంటి జోనర్ సినిమాలు నెలకొకటి వస్తున్నాయి. నేను ఫైట్ చేస్తే సినిమాలు ఆగిపోతాయని కాదు.
కానీ ఎప్పటికైనా మార్పు తీసుకొచ్చేలా ఓ ఉద్యమంలో చేయాలనుకుంటున్నాం. దాసరి తర్వాత తెలగు మోడ్రన్ సినిమాకు గురువుగా వర్మను పిలుచుకోవాలి. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది దర్శకులు అయ్యారు. కానీ ఆయన జీఎస్టీ లాంటి సినిమాలు చేసి చెడగొట్టు కుంటున్నాడు. అందుకే వర్మను కూడా వదిలే ప్రసక్తి లేదు. ఆయనతో కూడా ఫైట్ చేస్తాం. ఏది పడితే అది తీస్తా.. ఎలా పడితే అలా వాగుతానంటే కుదరదని ఆయన అసలైన అభిమానిగా చెబుతున్నా అని హెచ్చరించాడు.