వ‌ర్మ‌ను టెర్ర‌రిస్ట్ అనుకుంటున్నారా?

రామ్ గోపాల్ వ‌ర్మ ఏర్పాటు చేయాల‌నుకున్న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ప్రెస్ మీట్ కు నిన్న‌టి రోజున పోలీసులు అనుమ‌తివ్వ‌ని సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై వ‌ర్మ మాట్లాడారు. ఆ వేంటో ఆయ‌న మాట‌ల్లోనే? ట‌్రాపిక్ కు కు అంత‌రాయం క‌లుగుతుంద‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని ఆదివారం అధికారులు నోటీసులిచ్చారు. అది వాస్త‌వం. కానీ బ‌ల‌వంతంగా విజ‌య‌వాడ నుంచి పంపించాల‌ని నోటీసులో లేదు. అస‌లు ఆ నోటీసు ఎవ‌రిచ్చారో కూడా తెలియ‌దు. విజ‌య‌వాడ‌లో నా సినిమాకు అనుమ‌తివ్వ‌క‌పోవడం చాలా దారుణ‌మైన చ‌ర్య‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెకెండ‌రీ. నేను విజ‌య‌వాడ‌లో ఉండ‌టానికి కూడా అంగీక‌రించ‌లేదు.

నేనేమైనా టెర్ర‌రిస్ట్ నా? ఇది నాకు జ‌రిగిన‌ పెద్ద అవ‌మానంగా ఫీల‌వుతున్నా. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్ప‌టికే విడుద‌లైంది. కొత్త‌గా విజ‌య‌వాడ‌లో నేను చెప్పాల‌నుకున్న‌ది ఏం లేదు. నా గురించి పోలీసులు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో అర్ధం కాలేదు. న‌న్ను అడ్డోకోమ‌ని ఎవ‌రు ఆదేశిల‌చ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేసారు. అస‌లు ఎయిర్ పోర్టులోకి పోలీసులు ఎలా వ‌చ్చారు? ప‌్రెస్ మీట్లు పెట్టుకునే స్వేచ్ఛ నాకు లేదా? న‌న్ను ఏపీ రావోద్దంటున్నారు. ఏపీ ఏమైనా నార్త్ కొరియానా? వీసా తీసుకుని అడుగుపెట్టాలా? అని వ‌ర్మ ఆగ్ర‌హం చెందారు.