9.36 కి మెగా ఫ్యామిలీపై వ‌ర్మ ఎటాక్

Ram Gopal Varma's next Mega Family

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు కొత్తేం కాదు. ఆ ఫ్యామిలీపై కాంట్ర‌వ‌ర్శీ క్రియేట్ చేసి ప‌బ్లిసిటీ ద‌క్కించుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది. తాజాగా ఈరోజు స‌రిగ్గా 9.36 ఏ.ఎమ్ కి మెగా ఫ్యామిలీపై ఎటాక్ కి దిగుతున్నాడు. కంగారు ప‌డ‌కండి. ఎటాక్ అంటే? ఆ ఫ్యామిలీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కాదు. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు త‌ర్వాత త‌ను చేయ‌బోయే సినిమా అనౌన్స్ మెంట్. ఆ సినిమా టైటిల్ పేరు మెగా ఫ్యామిలీ అట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు.

దీంతో మ‌రోసారి వ‌ర్మ మెగా ఫ్యామిలీని త‌న క‌థ‌రూపంలో టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీని టైటిల్ వ‌ర‌కే ప‌రిమితం చేస్తాడా? లేక నిజ‌మైన మెగా ఫ్యామిలీని ఆధారం చేసుకుని సినిమా చేస్తాడా? అన్న‌ది ఇంకా గంట‌ల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఎన్నోసార్లు మీడియాకెక్కాడు. వాటకి అంతే ధీటుగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కౌంట‌ర్లు వేసారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో వ‌ర్మ మెగా ఫ్యామిలీని ఉద్దేశించే సినిమా చేస్తే పెద్ద దుమారం రేగ‌డం అయితే ఖాయ‌మ‌ని తెలుస్తోంది.