మెగాస్టార్ 152లో రాముల‌మ్మ‌

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 152వ సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల నుంచి రెగ్య‌లర్ షూటింగ్ కు వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున‌ప్నాయి. దాదాపు పాత టెక్నిక‌ల్ టీమ్ నే కొర‌టాల రంగంలోకి దించుతున్నాడు. చిరు స‌ర‌స‌న హీరోయిన్ గా ఇంకా ఎవ‌రినీ ఫైన‌ల్ చేయ‌లేదు. చాలా మంది భామల పేర్లు వినిపించాయి గానీ ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉన్నాయి.

తాజాగా ఈ ప్రతిష్టాత్మ‌క చిత్రంలో అల‌నాటి హీరోయిన్ విజ‌య‌శాంతిని ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసారుట‌. కొరటాల సినిమాల్లో పాత్ర‌ల‌న్ని హెచ్చు త‌గ్గులు లేకుండా స‌మానంగా ఉంటాయి. చిన్న చిన్న పాత్ర‌ను సైతం తెలివిగా వాడుకుంటాడు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌శాంతిని ఎంపిక చేసారంటే? క‌థ‌లో ఆమె పాత్ర ప్రాముఖ్య‌త ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స‌రి లేరు నీకెవ్వ‌రు సినిమాతో రాముల‌మ్మ రీ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.  ఇందులోనూ  ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్య‌త ఉంది. గ‌తంలో చిరు-విజ‌య‌శాంతి కాంబినేష‌న్ లో ప‌లు సినిమాలు తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.