రాముల‌మ్మ‌కి కోటి ఇస్తున్నారా?

విజ‌య‌శాంతి అలియాస్ రాముల‌మ్మ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేష్ కు త‌ల్లి పాత్ర‌లో రాముల‌మ్మ క‌నిపించ‌నుంది. దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత మేక‌ప్ వేసుకోవ‌డంతో రాముల‌మ్మ అభిమానులంతా ఆమె ని ఎప్పుడెప్పుడు చూద్దామ‌ని ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు. దీంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తోంది. మ‌రి ఈ సినిమాకు రాముల‌మ్మ ఎంత చార్జ్ చేస్తున్నార‌టే? అక్ష‌రాలా కోటి రూపాయాల‌ని టాక్ వినిపిస్తోంది. సినిమా లో న‌టిస్తాన‌ని రాముల‌మ్మ నిర్మాత‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు.

నిర్మాత‌లే ఆమెను ప‌ట్టుబ‌ట్టి ఒప్పించారు. పారితోషికం కూడా ఇంత కావాల‌ని రాముల‌మ్మ అడ‌గ‌కుండానే కొటి ఇస్తామ‌ని నిర్మాత‌లు ఒప్పందం చేసుకున్నారుట‌. రాముల‌మ్మ రేంజ్ చిన్న‌ది కాదులే. హీరోయిన్ గా ఓ వెలుగు వెలితారు. లేడీ ఓరియేంటెడ్ నిమాల్లోనూ ప్ర‌త్యేక‌త‌ను చాటి చెప్పారు. రాజ‌కీయాల‌లోనూ త‌న‌దైన ముద్ర వేసారు. ఆమెకంటూ ప్రత్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇవ‌న్నీ లెక్క గ‌ట్టి నేటి సినిమా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కొటి ఇవ్వాల్సిందే.