బిగ్ బాస్ -3 హోస్ట్ గా ర‌మ్య‌కృష్ణ‌

బిగ్ బాస్ -3 హోస్ట్ గా నాగార్జున స్థానంలో ర‌మ్య‌కృష్ణ వ‌స్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే షో ప్రారంభ‌మై 40 రోజులు పూర్త‌యింది. గాడి త‌ప్పిన బిగ్ బాస్ ని మ‌ళ్లీ దారిలోకి తీసుకొస్తున్నారు. సీజ‌న్ -2పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను మెల్ల‌గా చెరుపుతున్నారు. షోలో త‌న‌దైన మార్క్ చూపిస్తూ రేటింగ్ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చ‌రుక్కులు, చ‌మ‌క్కులు విసురుతూ హౌస్ మేట్స్ తో సంద‌డి చేస్తున్నారు. అయితే ఈ వారం కింగ్ షో లో క‌నిపించ‌రు.

ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల్లో భాగంగా కింగ్ కుటుంబంతో క‌లిసి విదేశాలు వెళ్లారు. సెల‌బ్రేష‌న్స అక్కడే గ్రాండ్ గా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో కింగ్ స్థానంలో సీనియర్ న‌టి ర‌మ్య‌కృష్ణ‌ను హోస్ట్ గా దించారు. దానికి సంబం ధించిన ప్రోమో ను కూడా బిగ్ బాస్ నిర్వాహ‌కులు రిలీజ్ చేసారు. మ‌రి ర‌మ్య‌కృష్ణ పెర్పామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. గ‌తంలో ర‌మ్య‌కృష్ణ త‌మిళ్ లో ప‌లు టెలివిజ‌న్ షోస్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో బంగారం మీ కోసం అనే గేమ్ షో కు హోస్ట్ గా చేసారు.