శివమెత్తిన ర‌మ్య ఆంటీ

Last Updated on by

లేటు వ‌య‌సులో ఘాటు వ్య‌వ‌హారం అంటే ఇదేనేమో! వ‌య‌సు మీద ప‌డుతున్న కొద్దీ సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ శివంగిలా శివాలెత్తుతోంది. బాహుబ‌లి సిరీస్‌లో రాజ‌మాత‌ శివ‌గామి పాత్ర‌తో మైమ‌రిపించిన ర‌మ్య‌కృష్ణ ప్ర‌స్తుతం అదే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న బ‌హుభాషా చిత్రంలో న‌టిస్తోంది. భారీ బ‌డ్జెట్ చిత్రం `రాణి శివ‌గామి` తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో రిలీజ్ కానుంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు యువ‌హీరోల‌కు అత్త పాత్ర‌లోనూ న‌టిస్తూ ర‌మ్య ఆంటీ వేడి పెంచుతున్నారు. మారుతి తెర‌కెక్కిస్తున్న‌ `శైల‌జారెడ్డి అల్లుడు` (ఆగ‌స్టు 31 రిలీజ్‌) చిత్రంలో అక్కినేని నాగ‌చైత‌న్యకు అత్త‌గా న‌టిస్తున్న ర‌మ్య‌కృష్ణ మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్నార‌ని తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ సినిమాలో మ‌రో ఛాలెంజింగ్ రోల్‌ని ఈ సీనియ‌ర్ న‌టి ఓకే చేశార‌ట‌. ఈ సినిమాకి `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేం సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. 1-నేనొక్క‌డినే, దూకుడు, ఆగ‌డు చిత్రాల్ని నిర్మించిన‌ 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎఫ్ 2, సంక‌ల్ప్‌రెడ్డి సినిమాల త‌ర్వాత వ‌రుణ్‌తేజ్ సాగ‌ర్ చంద్ర‌తో సినిమాకి సిద్ధ‌మ‌వుతున్నాడు. అమ్మోరుగా, నీలాంబ‌రిగా, శివ‌గామిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించిన సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ రెండో ఇన్నింగ్స్‌లో అంతే జోరు చూపించ‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హీట్ పెంచుతోంది.

User Comments