న‌క్స‌లైట్ పాత్ర‌లో రానా

Last Updated on by

రానా ద‌గ్గుబాటి ప్ర‌యోగాల గురించి తెలిసిందే. తొలి నుంచి వైవిధ్య‌మైన పాత్ర‌ల్ని ఎంపిక చేసుకుని కొత్త ద‌ర్శ‌కుల్ని ఎంక‌రేజ్ చేస్తున్నాడు. రాజ‌కీయ నాయ‌కుడు, నావీ అధికారి, షార్ప్ షూట‌ర్, రా అధికారి .. ఇలా విభిన్న‌మైన పాత్ర‌ల‌తో రానా మెప్పించాడు. భ‌ళ్లాల‌దేవ‌గా మాహిష్మ‌తి సామ్రాజ్యానికి అధిప‌తిగానూ చెర‌గ‌ని ముద్ర వేశాడు. అందుకే అత‌డు త‌దుప‌రి న‌టించే సినిమాల్లోనూ ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నాడు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. రానా ద‌గ్గుబాటి న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడని తెలుస్తోంది. `నీది నాది ఒక‌టే క‌థ‌` ఫేం వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా టైటిల్ `విరాట పర్వం`. 1992 బ్యాక్ డ్రాప్ లో చిత్ర‌మిది. నాటి దుష్ట‌ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై పోరాటం చేసే న‌క్స‌లైట్ గా రానా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. వ్య‌వ‌స్థ‌లో అవ్య‌వ‌స్థ‌పైనా పోరాటం సాగించే విప్ల‌వ‌కారుడిగా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ట‌బు హ్యూమ‌న్ రైట్స్ యాక్టివిస్టుగా న‌టించ‌నున్నారు. సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. రానా న‌టిస్తున్న హాతీ మేరా సాథీ, హౌస్ ఫుల్ 4 చిత్రాల షూటింగ్ ని రానా ముగించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. త‌దుప‌రి విరాట ఫ‌ర్వంపై దృష్టి సారిస్తాడ‌ట‌.

User Comments