అచ్చు గుద్దిన‌ట్టే చంద్ర బాబే!

Last Updated on by

చూడగానే మ‌నిషిని పోలిన మ‌నిషిని చెప్పేయొచ్చు. ఈ ఫోటోలో క‌నిపిస్తున్న ఆయ‌న్ని చూడ‌గానే చంద్ర‌బాబు గుర్తుకు రావాల్సిందే. అదే ఆహార్య ం.. అదే పోలిక‌.. అదే చూపు.. అచ్చ ం అలానే ఉన్నాడు. ఆ ప‌క్క పాపిడి.. ఓర చూపు.. ఆహార్య ం అంతా సేమ్ టు సేమ్‌. ప‌క్కాగా సూట‌య్యాడు రానా బాబు. ఈ లుక్ ఎన్టీఆర్ సినిమా కోసం డిజైన్ చేసిన‌ది..

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం య‌న్‌.టి.ఆర్‌. ఈ బయోపిక్‌లో రానా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నారు. వినాయక చవితి సంద‌ర్భ ంగా చంద్రబాబు లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1984లో చంద్రబాబు అచ్చ ం ఎలా ఉండ‌వారో అలానే రానా క‌నిపిస్తున్నారు. ఈ చిత్రానికి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఫేం క్రిష్ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ భార్యామ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్, ఏఎన్నార్ పాత్ర‌లో సుమంత్‌, శ్రీ‌దేవిగా ర‌కుల్ ప్రీత్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో ఆ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.

User Comments