తెలుగు దంగ‌ల్ లో రానా!

Last Updated on by

అదేంటి.. అమీర్ ఖాన్ దంగ‌ల్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారా..? ఈ మాట ఎక్క‌డా వినిపించ‌లేదు.. అయినా దంగ‌ల్ తెలుగులో విడుద‌లైంది క‌దా అనుకుంటున్నారా..? అవును.. దంగ‌ల్ తెలుగులో విడుద‌లైన మాట నిజ‌మే.. ఇప్పుడు దంగల్ లాంటి సినిమాలో రానా న‌టించ‌బోయే మాట కూడా నిజ‌మే. అస‌లు విష‌యం ఏంటంటే.. మ‌హ‌వీర్ సింగ్ పొగాత్ జీవిత క‌థ‌లో న‌టించి రికార్డులు సృష్టించాడు అమీర్ ఖాన్. ఇక ఇప్పుడు రానా కూడా ఈ త‌ర‌హా మ‌ల్ల‌యోధుడి బ‌యోపిక్ లో న‌టించ‌బోతున్నాడు. ఆయ‌న మ‌న తెలుగు వాడు కావ‌డం విశేషం. ఈయ‌న పేరు కోడి రామ్మూర్తి నాయుడు. ఈయ‌న మ‌ల్ల‌యోధుడు మాత్రమే కాదు స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. 5000కి పైగా పోటీల్లో పాల్గొని ఓటమి లేకుండా విజ‌య బావుటా ఎగ‌ర‌వేసిన యోధుడు రామ్మూర్తి నాయుడు.

ఈయ‌న బ‌యోపిక్ అంటే ఖచ్చితంగా ఎన్నో స్పూర్థి ర‌గిలించే అంశాలుంటాయి. ఈ చిత్రం కోసం ఓ అగ్ర ద‌ర్శ‌కుడితో మాట‌లు జ‌రుగుతున్నాయి. ఆయ‌న ఒప్పుకుంటే వెంట‌నే బ‌యోపిక్ మొద‌లు కానుంది. అప్ప‌ట్లో ఈయ‌న‌ ప్ర‌తిభ‌ను మెచ్చి కింగ్ జార్జ్ స్వయంగా ఇండియన్ హెర్క్యూలెస్.. కలియుగ భీమ లాంటి బిరుదులతో కోడి రామ్మూర్తి నాయుడు గారిని సత్కరించారు. బ్రిటిష్ పాలన బలంగా ఉన్న 1900 తొలి నాళ్ళల్లోనే ఈయ‌న స‌త్తా చూపించాడు. ఈయ‌న యుద్ధాలు స్వాతంత్య్ర ఉద్యమానికి కూడా ఎంతో స్పూర్థి ర‌గిలించింది. బాహుబ‌లి త‌ర్వాత రానా ఎంచుకుంటున్న స‌బ్జెక్టులు చూసి అంతా షాక్ అవుతున్నారు. 1945.. ట్రావెల్ కోర్ మహారాజు.. హాథీ మేరి సాథీ.. విజిల్ ఇలా భిన్నమైన సినిమాల‌తో దూసుకుపోతున్న రానాకు ఇప్పుడు రామ్మూర్తి నాయుడు బ‌యోపిక్ మ‌రో ప్ర‌త్యేక చిత్రంగా మారిపోనుంది.

User Comments