సన్నీలియోన్ – రానా.. ఏం చేస్తున్నారో తెలుసా..?

ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లు, సెలబ్రిటీలు సినిమాలతో పాటు బయట బిజినెస్ రంగంలో కూడా బాగానే అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొన్నటివరకు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వాటిని ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తే.. ఇప్పుడు మాత్రం సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఈ మధ్య డైరెక్ట్ గా క్రీడారంగంలోకి ఎంటర్ అవుతూ.. ప్రాంచైజీల పేరిట పలు రకాల క్రీడల్లో ఏదో ఒక జట్టును కొనుక్కోవడం.. లేదా భాగస్వామ్యం కావడం అనేది కొత్త ట్రెండ్ గా మారిన విషయం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐపీఎల్, కబడ్డీ లీగ్ తరహాలో ఇండియాలో ఫుట్సల్ అంటూ ఫుట్ బాల్ లీగ్ మెల్లగా ఊపందుకోవడం గమనార్హం. అలాగే త్వరలోనే దీనికి సంబంధించి సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ కానుంది.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ లీగ్ కోసం మనకు బాగా తెలిసిన ఇద్దరు స్టార్స్ పోటీ పడబోతుండటం విశేషం. ఆ స్టార్స్ మరెవరో కాదు.. టాలీవుడ్ నుంచి మన రానా తెలుగు టైగర్స్ టీమ్ కు ప్రచారకర్తగా వ్యవహరించనుండగా, బాలీవుడ్ నుంచి సన్నీలియోన్ మొత్తంగా కేరళ కోబ్రాస్ టీమ్ లో వాటా కూడా కొనేసి దిగుతుండటం ఇంట్రెస్టింగ్ మేటర్ అవుతుంది. దీంతో త్వరలోనే ఈ లీగ్ లో సన్నీలియోన్ వర్సెస్ రానా పోటీ మనల్ని ఎంటర్టైన్ చేయనుందని అప్పుడే ప్రచారం మొదలైపోయింది. అయితే, సన్నీలియోన్ – రానా లు ఇద్దరూ డైరెక్ట్ గా ఏమీ తలబడకపోయినా వాళ్ళ టీమ్ లు పోటీ పడుతున్నప్పుడు మాత్రం స్టేడియంలో సందడి చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ లెక్కన సన్నీలియోన్ అండ్ రానా ల హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే.. మంచి ఊపులో ఉన్న ఈ తాజా స్పోర్ట్స్ లీగ్ ను మిస్ అవ్వకూడదంతేనని అంటున్నారు.