షాకిస్తున్న రానా స‌న్న‌జాజి లుక్

భ‌ళ్లాల దేవ రానా ఇంత హ‌ఠాత్తుగా బరువు తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది? ఏమో .. ప్ర‌స్తుతానికి అభిమానులు మాత్రం షాక్ తిన‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. భ‌ళ్లాలుని రూపం మ‌రీ ఇంతగా మారిపోయిందే అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. అస‌లు రానా తిన‌డం మానేశాడా.. అన‌వ‌స‌రంగా తిండి క‌ట్టేస్తే ఎలా.. కాస్త తిని ఒళ్లు పెంచాలి కానీ! అంటూ సోష‌ల్ మీడియాలో అప్పుడే సెటైర్లు ప‌డిపోతున్నాయ్. మొత్తానికి మారిన లుక్ తో రానా ఒక్క‌సారి గా వాడి వేడిగా చర్చ‌ల్లోకి వ‌చ్చాడు. అసలింత‌కీ రానాలో ఎందుకింత మార్పు?
డెబ్యూ `లీడర్` సినిమా టైమ్ లో రానా ఎంతో స‌న్న‌గా ఉండేవాడు. అరే ఊదేస్తే ఎగిరిపోతాడు! అంటూ కామెంట్లు చేసిన‌వాళ్లు ఉన్నారు. ఆ త‌ర్వాత రానా అస‌లు విశ్వ‌రూపం బాహుబ‌లి చిత్రంలో చూశారు. భ‌ళ్లాలుడిగా వీర‌విహారం చేసిన రానాను చూస్తే అస‌లు ఆ రానానే ఈ రానానా? అంటూ మాట్లాడుకున్నారు. మ‌జిల్ మ్యాన్ గా మ్యాకో మ్యాన్ గా మారిపోయి మ‌గువ‌ల‌కు కంటిపై కునుకు క‌రువ‌య్యేలా చేశాడు రానా. అయితే బాహుబ‌లి త‌ర్వాత  రానా కొద్ది మేర‌ త‌గ్గిపోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.
ఇందుకు కాకరణం రానా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం అని అప్పట్లో ప్ర‌చారం సాగింది. ఆ విష‌యాన్ని రానా తండ్రి సురేష్ బాబు కూడా ధృవీక‌రించారు. రానా స్వల్ప ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా రానా మ‌రోసారి పూర్తిగా స‌న్న‌జాజిలా మారిపోవ‌డం చర్చ‌కు వ‌చ్చింది. అస‌లు ఈ రూపాన్ని ఊహించ‌లేమ‌ని అభిమానులు అంటున్నారు.  హైదరాబాద్ విమానాశ్ర‌యం నుండి వస్తూ రానా లేటెస్టుగా మీడియా కంటపడ్డాడు. అస్సలు గుర్తుపట్టలేనంత సన్నగా మారిపోయిన రానా లుక్ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ లుక్ చూసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. ఇప్పుడు రానా చేస్తున్న సినిమాలు హాథీ మేరే సాథీ, విరాటపర్వ ం కోసం ఏమైనా ఇలా బరువు తగ్గాడా? లేక ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా? అని చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే  రానా హౌస్ ఫుల్ 4 చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని త‌దుప‌రి చిత్రానికి ప్రిప‌రేష‌న్ మొద‌లు పెట్టాడ‌ని తెలుస్తోంది. పొడ‌వాటి గడ్డంతో సైంటిస్టులా క‌నిపిస్తున్నాడు. మ‌రి ఏ సినిమా కోసం అన్న‌ది త‌నే చెబుతాడేమో చూడాలి.