భ‌ళ్లాలుడి రాజ‌ప్ర‌సాదం చూశారా?

Rana - File Photo

ఫేవ‌రెట్ స్టార్ల వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి అంద‌రికీ ఉంటుంది. హీరోలు అంటే భోగ‌భాగ్యాలు అన్న భావ‌న ఉంటుంది. నిజమే అది .. మ‌న స్టార్ హీరోలు స‌క‌ల రాజ‌భోగాల రాజ‌ప్ర‌సాదాల్లోనే జీవిస్తున్నారనడంలో సందేహం లేదు. కోట్లాది రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన రాజ‌ప్రాకారాల్లో స్టార్లు జీవిస్తున్న‌ది నిజ‌మే.

భ‌ళ్లాల‌దేవ రానా రాజ‌భ‌వంతి ప్ర‌త్యేక‌త ఆస‌క్తిక‌రం. అందులో ఆర్కిటెక్చ‌ర్ నైపుణ్యం.. మ‌హ‌దాద్భుత‌మైన సౌక‌ర్యాల‌తో రాజ‌ప్ర‌సాదానికి ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో రానా త‌న ఇంటిని నిర్మించుకున్నారు. ఈ భారీ భ‌వంతిని చాలా ఏళ్ల క్రిత‌మే స‌క‌ల సౌక‌ర్యాల‌తో త‌న నివాసాన్ని నిర్మించుకున్నారు. ఇక్క‌డ స్టోరి సిట్టింగ్స్ కూడా జ‌రుగుతుంటాయ‌ట‌.

రానా నివ‌శించే జూబ్లీహిల్స్ ఇంటికి సంబంధించి తాజాగా సోష‌ల్ మీడియాలో ఫోటోలు కొన్ని రిలీజ‌య్యాయి. రానా లివింగ్ రూమ్‌. హాల్, బెడ్ రూమ్ .. లాంజ్ ఇలా అన్నీ ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దారు. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో రామానాయుడు స్టూడియోస్ స‌మీపంలోనే ఈ ఇల్లు ఉంటుంది.