చంద్ర‌బాబు వ‌ర్సెస్ రానా

Last Updated on by

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- క్రిష్ బృందం ఇటీవ‌లే ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే అక్క‌డ యువ‌హీరో రానా చంద్ర‌బాబుతో మంత‌నాలు సాగిస్తూ ఆస‌క్తి పెంచాడు. సీఎం చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టించే ముందు స‌న్నాహ‌క‌మిద‌ని ప్ర‌చార‌మైంది. అయితే రానా చంద్ర‌బాబు పాత్ర కోసం ఏం చేయ‌బోతున్నాడు? అంటే ఇదిగో ఇదే స‌మాధానం.

`ఎన్టీఆర్` బ‌యోపిక్‌లో చంద్ర‌బాబుగా న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాన‌ని చెప్పిన రానా.. త‌న పాత్ర కోసం ఎలాంటి క‌ర‌త్తు చేస్తున్నాడో రానా స్వ‌యంగా చెప్పుకొచ్చారు. “25 ఏళ్లుగా ఒక రాజ‌కీయ‌నాయ‌కుడిగా చంద్ర‌బాబు ఎదుగుద‌ల‌ను చూస్తూనే ఉన్నాను. జ‌నాల్ని, సంఘాన్ని ఆయ‌న ఎంత‌గానో ప్ర‌భావితం చేసిన ప్ర‌ముఖుడు. ఆయ‌న వీడియోల్ని ప‌రిశీలించి జాగ్ర‌త్త‌గా న‌టించేందుకు అన్నిర‌కాలా సిద్ధ‌మ‌వుతున్నాను“ అని తెలిపారు. ప్ర‌స్తుతం న్యూస్‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆహార్యం, గెట‌ప్ ఎలా ఉన్నాయో రానా ప‌రిశీలిస్తున్నార‌ట‌. చంద్ర‌బాబు ఆహార్యం ఇత‌ర రాజ‌కీయ‌నేత‌ల‌తో పోలిస్తే కాస్తంత ఠిఫిక‌ల్ అనే చెప్పాలి. అత‌డికంటూ ఓ శైలి ఉంది. వేష‌ధార‌ణ ప‌రంగా మేక‌ప్ డిపార్ట్‌మెంట్ ప‌నిత‌నం చూపించినా, బాబులోని ఆ ఎక్స్‌ప్రెష‌న్‌ని .. ఆ క‌ళ్ల‌లో సైక‌లాజిక‌ల్ పొలిటిక‌ల్ గేమ్‌ని రానా ఎలా వోన్ చేసుకుని తెర‌పై ఆవిష్క‌రిస్తాడో వేచి చూడాల్సిందే.

User Comments