ఫ‌ల‌క్‌నుమా దాస్‌కి ద‌గ్గుబాటి బూస్ట్

Last Updated on by

చిన్న సినిమాల్లో మంచి సినిమాల్ని వెతికి ప‌ట్టుకోవ‌డం ద‌గ్గుబాటి హీరో రానాకు హ్యాబిట్. మంచి సిన‌మా ఇది అన్న టాక్ వినిపిస్తే చాలు ఆ సినిమాకి ప్ర‌చార సాయం అందిస్తున్నారు. ఇదివ‌ర‌కూ కేరాఫ్ కంచ‌ర‌పాలెం వంటి ఔటాఫ్ బాక్స్ సినిమాకి ప్ర‌మోష‌న‌ల్ గా సాయం అందించిన ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం మ‌రో చిన్న సినిమాని ఎంపిక చేసుకుని ప్ర‌చార సాయం చేస్తున్నారు. ఈసారి `ఫ‌ల‌క్‌నుమా దాస్` చిత్రానికి రానా సాయం అంద‌నుంద‌ట‌.

ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజై సంచ‌ల‌నాలు సృష్టించింది. ద‌గ్గుబాటి వారి బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో `ఈ న‌గ‌రానికి ఏమైంది?` వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రం తెర‌కెక్కించిన త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించారు. `ఫ‌ల‌క్‌నుమా దాస్` చిత్రంతో విశ్వ‌క్ సేన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదో క్రైమ్ కామెడీ జోన‌ర్ మూవీ. పాత బ‌స్తీలో గ్యాంగ్ వార్ నేప‌థ్యంలో ఉత్కంఠ భ‌రిత‌మైన విజువ‌ల్స్ ని చూపిస్తున్నార‌ని అర్థ‌మైంది. మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అంగ‌మ‌లై డైరీస్` కి రీమేక్ గా తెర‌కెక్కుతోంది. విశ్వక్ సేన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఇక ఈ సినిమా రిలీజ్ బ‌రిలోకి వ‌స్తున్న వేళ రానా ప్ర‌మోష‌న్ పెద్ద సాయం అవుతుంద‌న్న చ‌ర్చా సాగుతోంది. ఇక సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి సంస్థ అండ‌గా నిలిచిందంటే రిలీజ్ ప‌ర‌మైన చిక్కులు త‌ప్పిన‌ట్టేన‌న్న టాక్ వినిపిస్తోంది.

User Comments