భల్లాలదేవుడుగా రానా చేయాల్సింది కాదు

రాజమౌళి ఇష్టపడి కష్టపడి తీసిన సినిమా బాహుబలి. మొదట ఈ సినిమాను ఒక్క భాగమే చేద్దామని అనుకున్నారట.

అందుకు కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుంది.

పైగా చెప్పాల్సిన కథ ఎక్కువగా ఉండటంతో.. ఒక్క పార్ట్ లో సరిపోదని రెండు పార్టులు చేయాలనీ నిర్ణయించుకున్నారట.

ఇదిలా ఉంటే, ఇందులో ప్రభాస్ తో పాటు నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది.

ముఖ్యంగా విలన్ రోల్ ప్లే చేసిన రానాకు తిరుగులేని ఇమేజ్ వచ్చింది. భళ్లాలదేవుడిగా రానా పండించిన విలనిజం సినిమాకు కూడా మంచి ప్లస్ అయింది.

కానీ, ఈ బాహుబలి, భల్లాలదేవుడు నిజంగా రానా చేయాల్సింది కాదని తాజాగా తెలియడం స్వీట్ షాక్ అనే అనాలి.

మొదట ఆ పాత్ర కోసం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఖల్ డ్రోగో పాత్రలో కనిపించిన జాసస్ మొమోవాను ఫిక్స్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారట.

కానీ, కొన్ని కారణాల వలన తిరిగి తిరిగి రానా వద్దకు భల్లాల దేవ క్యారెక్టర్ వచ్చిందని తాజా సమాచారం. ఈ విషయాన్ని తాజాగా రానాయే స్వయంగా చెబుతూ.. సినిమా పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని కూడా రాజమౌళి చెప్పారని పేర్కొన్నాడు.

అంతేకాకుండా బాహుబలి అనేది గ్లాడియేటర్ తరహాలో భారీ కాన్వాస్ ఉన్న సినిమా అని, లైఫ్ లో మరలా అలాంటి సినిమా చేయగలనో లేదో అని చెప్పి సినిమా చేయడానికి రానా అంగీకరించాడట.

ఆ విధంగా రానాకు ఈ బంగారు అవకాశం వెతుక్కుంటూ వచ్చిందట. మరి నిజంగా భళ్లాలదేవుడిగా ఆ జాసన్ కనిపిస్తే ఎలా ఉండేదో తెలియదు గాని, మన రానా మాత్రం ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసి పిచ్చెక్కించాడనే అనాలి.

Follow US