వావ్.. ఎన్టీఆర్ బిగ్ బాస్ లోకి రానా ఎంట్రీ..!

తెలుగు బుల్లితెర పైకి రియాలిటీ షో పేరుతో వచ్చిన బిగ్ బాస్, ఎన్టీఆర్ పుణ్యమా అని బాగానే నడుస్తోన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడేమో ఓ స్పెషల్ గెస్ట్ తో బిగ్ బాస్ హౌస్ మరింత కలర్ ఫుల్ గా మారబోతుండటం విశేషం.

అయితే, స్పెషల్ గెస్ట్ అంటే ఏ దీక్షా పంత్ లాగో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారేమో అనుకుంటే పొరపాటు పడినట్లే.

ఎందుకంటే, కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ పేరుతో ఓ సెలబ్రిటీ ఎంట్రీ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే, ఆ సెలబ్రిటీ మరెవరో కాదు..

ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి‘ అంటూ అలరించడానికి రెడీ అవుతున్న రానా దగ్గుబాటి.

అసలు విషయంలోకి వెళితే, బాలీవుడ్ తరహాలో తమ సినిమాలు రిలీజ్ కు రెడీ అయినప్పుడు బిగ్ బాస్ షో కి వచ్చి వాటిని ప్రమోట్ చేసుకోవడం, అదే టైమ్ లో బిగ్ బాస్ కు కూడా కొత్త కళను తీసుకురావడం ఇప్పుడు టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అవుతుంది.

అది కూడా రానా లాంటి యంగ్ స్టార్ హీరో సినిమాతో కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఈ మేరకు రానా తన కొత్త సినిమా నేనే రాజు నేనే మంత్రి ని రిలీజ్ కు ముందు బిగ్ బాస్ ద్వారా ప్రమోట్ చేసుకోవడమే కాకుండా షో ను మరింత పైకి లేపడానికి తనవంతు సాయం చేసినట్లు అవుతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షూటింగ్ కు వెళ్ళబోతూ ఎయిర్ పోర్ట్ లో రానా పంచెకట్టుతో కనిపించి ఆశ్చర్యపరిచాడని అంటున్నారు.

దీంతో మొన్నటి నుంచీ ఆ అవతారంలోనే ఉన్న రానా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అలానే ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెబుతున్నారు.

మరి ఇదే నిజమైతే, ఇప్పటికే దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ తో కలిసి రానా ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.

అందులోనూ ఇప్పుడు బిగ్ బాస్ లో ఒక సర్ప్రైజ్ అంటూ రానా గురించి గట్టిగానే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఓ రేంజ్ లో సందడి ఉంటే గాని జనాలు సంతృప్తి పడేలా కనిపించడం లేదు.

Follow US