దగ్గుబాటి రానా ఆరడుగుల అందగాడు. కానీ అనూహ్యంగా ఆయన 16 అడుగులు ఎదిగాడు. 30 ప్లస్ లో 16 అడుగులు ఎలా అనుకుంటున్నారా? అయితే అసలు సంగతి తెలుసుకోవాల్సిందే.
ఓసారి రానా ఇన్ స్టాగ్రామ్ లోకి వెళితే అక్కడ.. 16 అడుగుల రానా ఫోటోని ఆయనే అభిమానులకు షేర్ చేసాడు. తలపై కౌబాయ్ క్యాప్..కళ్లకి నల్ల అద్దాలు ధరించి చిరునవ్వు చిందుస్తూ దర్శనమిచ్చాడు. మరి ఇలా సరదాగా చేసాడా? సినిమా కోసం చేసాడా? అన్నది సెకెండరీ. కానీ ఇప్పుడా పిక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఇంత హైట్ ఉన్న మనుషుల్ని జాతర్లలలో, సర్కస్ లలో చూస్తుంటాం. కాళ్లకు కర్రలు కట్టుకుని బ్యాలెన్స్ గా నడుస్తుంటారు. రానా కూడా అలాగే ట్రై చేసినట్లున్నాడు. అసలే రానా మంచి ఒడ్డు పొడుగు న్న హీరో. దీంతో ఆయనే కాళ్లకు కర్రలు కట్టుకోవడంతో మరింత ఎత్తుగా కనిపించాడు. ఆ ఫోటో అందర్నీ అలరిస్తోంది. ప్రస్తుతం రానా విరాటపర్వం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. 2020లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా ఫొటో.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
