రానా న‌క్స‌లిజం మొద‌లు

యంగ్ డైన‌మిక్ హీరో రానా కెరీర్ స్పీడ్ గురించి తెలిసిందే. హాథీ మేరా సాథీ.. హౌస్ ఫుల్ 4, హిర‌ణ్య‌క‌శిప లాంటి భారీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. వీటితో పాటు రెండు మూడు త‌మిళ చిత్రాల‌కు సంత‌కాలు చేశాడు. ఈలోగానే వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ సినిమాని నేడు హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభించేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో సాయిపల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో రానా పోలీస్ గా న‌టిస్తే సాయిప‌ల్ల‌వి న‌క్స‌లైట్ గా న‌టిస్తోందని ప్ర‌చారం సాగింది. లేదు ఇద్ద‌రూ న‌క్స‌లైట్లుగా న‌టిస్తార‌ని అందుకే విరాట ప‌ర్వం అనే టైటిల్ ని ఎంపిక చేశార‌ని చెప్పుకున్నారు. మొత్తానికి వేణు ఉడుగుల సినిమా ప్రారంభానికి ముందే హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో ట‌బు పోలీస్ అధికారిగా న‌టించ‌నుంది. మ‌రో కీల‌క పాత్రకు ప్రియ‌మ‌ణిని ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు నానా ప‌టేక‌ర్ పాత్ర ఉత్కంఠ క‌లిగించ‌నుంది. రామానాయుడు స్టూడియోస్ లో సినిమాని లాంచ్ చేస్తున్నార‌ట‌.