టాట్టూలో చిక్కిన మాజీ ప్రియుడు?

Last Updated on by

దీపిక ప‌దుకొన్ ప్రేమాయ‌ణాల గురించి ప్ర‌త్యేకించి గుర్తు చేయాల్సిన ప‌నేలేదు. కెరీర్ ఆరంభ‌మే చాక్లెట్ బోయ్‌ ర‌ణ‌బీర్ క‌పూర్‌తో డీప్‌గా ప్రేమ‌లో మునగడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ర‌ణ‌బీర్ – దీపిక బ‌హిరంగంగానే త‌మ ప్రేమ‌ను క‌న్ఫామ్ చేశారు. ఆ ఇద్ద‌రూ జంట‌గా రెండు సినిమాల్లోనూ న‌టించారు. 2013లో `యే జ‌వానీ హై దీవాని`, 2015లో `త‌మాషా` చిత్రాల్లో ఈ జంట ఆడిపాడారు. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్యా బాండింగ్ బ‌ల‌పడింది. అటుపై ఊహించ‌ని రీతిలో ర‌ణ‌బీర్ ఇచ్చిన జోల్ట్‌కి దీపిక ఒక్క‌సారిగా విర‌క్తితో అత‌డికి బ్రేక‌ప్ చెప్పేసింది.అంత‌గా ర‌ణ‌బీర్ ఏం చేశాడు? అంటే .. దీపిక‌తో ఓవైపు ప్రేమాయ‌ణం సాగిస్తూనే క‌త్రిన‌తో చాటు మాటు రొమాన్స్ సాగించాడని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. మొత్తానికి ఆ ముక్కోణ ప్రేమ‌క‌థ బోలెడ‌న్ని మ‌లుపులు తిరిగింది. చివ‌రికి ర‌ణ‌బీర్ కేవ‌లం దీపిక‌తోనే కాదు, క‌త్రిన నుంచి విడిపోయి… ప్ర‌స్తుతం సింగిల్ స్టాట‌స్‌ని కొన‌సాగిస్తుండ‌డం తెలిసిందే. దీపిక బ్రేక‌ప్ త‌ర‌వాత తాను వ‌ల‌చిన కోస్టార్ .. ఎన‌ర్జిటిక్ గ‌య్‌ ర‌ణ‌వీర్ సింగ్‌ని పెళ్లాడేందుకు రెడీ అవుతోంది.

ఈ క‌థంతా ల‌వ్‌స్టోరిలో ట్విస్టుల‌కు సంబంధించిన‌ది. ఇందులో వేరొక ట్విస్టు కూడా ఉంది. ర‌ణ‌బీర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు దీపిక చేసిన ఓ త‌ప్పిదం ఇప్ప‌టికీ వెంటాడుతూనే ఉంది. అదే టాట్టూ (ప‌చ్చ‌బొట్టు). అప్ప‌ట్లోనే దీపిక త‌న మెడ‌వెన‌క భాగంలో ఆర్‌కె (ర‌ణ‌బీర్ క‌పూర్‌) అని రెండ‌క్ష‌రాల‌తో టాట్టూ పొడిపించుకుంది. అయితే ఆ టాట్టూ శాశ్వ‌తంగా చెరిగిపోనిది కావ‌డంతో ర‌ణ‌బీర్‌తో బ్రేక‌ప్ అయ్యాక‌ అది అలానే ఉండిపోయింది. ఒక‌వేళ దానిని తొల‌గించాలంటే లేజ‌ర్ చికిత్స అవ‌స‌రం అవుతుంది. కానీ అందుకు దీపిక స‌సేమిరా అంది. దీనిపై మీడియా ఎన్నిసార్లు ప్ర‌శ్నించినా .. అస‌లు ఆ టాట్టూను తొల‌గించే ప్ర‌స‌క్తే లేద‌ని ఖ‌రాకండిగా చెప్పేసింది. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ సింగ్ ప్రేమ‌లో ఉన్నా, త్వ‌ర‌లో పెళ్లికి రెడీ అవుతున్నా ఆ టాట్టూ మాత్రం అలానే ఉంది. న్యూయార్క్‌లో ఓ జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తున్న దీపిక లేటెస్ట్ ఫోటోల్ని జిమ్ కోచ్ సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంతో ఇలా మ‌రోసారి టాట్టూ హాట్ టాపిక్ అయ్యింది. ఎవ‌రినీ కేర్ చేయ‌ని దీపిక త‌త్వాన్ని ఈ వోల్ ఎపిసోడ్స్‌ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

User Comments