గాడ్ ఫాదర్ 2 స్ఫూర్తితో ర‌ణ‌రంగం

శర్వానంద్ కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు నాయ‌కానాయిక‌లుగా న‌టించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ…‘గాడ్ ఫాదర్ 2’ మూవీ స్క్రీన్ ప్లే నుండి ప్రేరణ పొందడం తీసుకోవడం జరిగింది. జనరల్ గా ‘గ్యాంగ్ స్టర్’ మూవీ తీసే ఎవరికైనా గాడ్ ఫాదర్ మూవీనే ఓ ప్రేరణ. మేము కూడా ఆ స్క్రీన్ ప్లే నుండే స్పూర్తి పొంది రాసుకోవడం జరిగింది. మరి మేము ఎంతబాగా స్క్రీన్ ప్లే చేశామనేది, మూవీ ఫలితం తరువాత తెలుస్తోంది. శర్వా చిత్రాలలో నాకు ప్రస్థానం బాగా ఇష్టం. శర్వాతో చిత్రం చేస్తే ఫ్యామిలీ, లవ్ కాకుండా కొంచెం సీరియస్ జోనర్ లో ఉన్న మూవీ చేయాలనుకున్నాను. అలా రణరంగంతో మీ ముందుకు వస్తున్నాం. ‘స్వామిరారా’ సినిమా విడుదల తర్వాతే చిన్నబాబుగారు పిలిచి సినిమా చేయమని అడ్వాన్స్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాను. సితార బ్యానర్ లో సినిమా చేయడానికి ఇప్పుడు కుదిరింది. సితార బ్యానర్ లో పని చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. నిర్మాత నాగవంశీగారికి సినిమా అవుట్ ఫుట్ ముఖ్యం.

ఎక్కడా క్వాలిటీ తగ్గుకుండా సినిమా చేయమని చెప్పారు. ఆ క్రమంలో ముందు అనుకున్నదాని కంటే బడ్జెట్ పెరిగింది. నా కెరీర్‌ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా. వాస్తవానికి ఇప్పటివరకూ నాగవంశీగారు నాకు బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పలేదు. ఆయనకి బడ్జెట్ కంటే కూడా సినిమా క్వాలిటీ మాత్రమే ముఖ్యం. సినిమాలో శర్వానంద్ అచ్చం ‘గ్యాంగ్ స్టర్’లానే కనిపిస్తాడు. అంతబాగా తను ఆ రోల్ ను ఓన్ చేసుకుని చేశాడు. ‘రణరంగం’లోని శర్వా క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయి. ఆ రెండు షేడ్స్ను ఆయన బాగా పలికించారు.‘రణరంగం’కి సీక్వెల్ చేసే ఆలోచన అయితే ఉంది. ఈ మధ్యనే శర్వానంద్ ఓ ఐడియా చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. కాకపోతే సీక్వెల్ రావాలంటే రణరంగం సినిమా ముందు సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే స్వీక్వెల్‌ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ సినిమా రిలీజ్ తర్వాతే సీక్వెల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

Also Read: Kajal Reveals Her Shocking Future Plans