ర‌ణ‌రంగం మూవీ రివ్యూ

నటీనటులు : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శ‌న్ త‌దిత‌రులు
బ్యానర్: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
సంగీతం: పిళ్లై
దర్శకత్వం: సుధీర్ వ‌ర్మ‌

ముందు మాట:
వెర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్ న‌టించిన తాజా చిత్రం ర‌ణ‌రంగం. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. రొటీన్ కి భిన్నంగా శ‌ర్వా
గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించారు. పాట‌లు ట్రైల‌ర్ ఆకట్టుకున్నాయి. అయితే శ‌ర్వా చేసిన ఈ కొత్త ప్ర‌య‌త్నం ఫ‌లించిందా లేదా తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథనం అనాలిసిస్:
బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుని బ‌తికేసే దేవా (శర్వానంద్) మ‌ధ్య నిషేధం క‌లిసొచ్చి దందాలు చేసుకుని చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌తో డాన్ గా మార‌తాడు. గ్యాంగ్ స్ట‌ర్ గా ఎదిగే క్ర‌మంలో ఎదుఐన స‌మ‌స్య‌లేంటి? వాటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అన్న‌దే సినిమా క‌థాంశం. 1990ల కాలంలో యువ‌కుడిగా క‌నిపించిన శ‌ర్వానంద్ ఆ త‌ర్వాత ఏజ్డ్ డాన్ గానూ సినిమాలో క‌నిపిస్తారు. ఇక ఈ రెండు పాత్ర‌ల్ని డీల్ చేసిన విధానం ఎంచుకున్న క‌థాంశం ప్ర‌తిదీ హైలైట్. గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో శ‌ర్వా అద్భుతంగా న‌టించాడు. ఆ స‌న్నివేశాలు సినిమాకి హైలైట్. అయితే య‌థావిధిగానే ద‌ర్శ‌కుడు మునుప‌టిలానే తప్పులు చేసాడు. ఎంచుకున్న క‌థ బావున్నా క‌థ‌నంలో చాలా చోట్ల గ్రిప్ స‌డ‌లింద‌నే చెప్పాలి. ఇందులో డాక్ట‌ర్ గా న‌టించేందుకు స్కోప్ ఉన్న పాత్ర‌లో కాజ‌ల్ న‌టించింది. ప‌ల్లెటూరి అమ్మాయిగా ప్రియ‌ద‌ర్శిని ప‌క్కాగా కుదిరింది. అయితే రెండో భాగంలో రొటీన్ సీన్స్ .. తెలిసిన స్క్రీన్ ప్లే ఆక‌ట్టుకోదు. పతాక సన్నివేశాలలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆక‌ట్టుకున్నా ఫ్లాట్ గా ఉంటుంది. కళ్యాణి ప్రియదర్శి 90ల కాలం నాటి ఆమ్మాయిగా ఆ పాత్రకు చక్కగా సరిపోయింది. ఓణీలలో ప్రతి సన్నివేశంలో ఆమె అమాయకత్వంతో కూడిన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ కంటే రెండవ సగంలో సహనానికి పరీక్ష పెట్టారు. ఐతే గ్యాంగ్ స్టర్ గా శర్వాని చూపించిన తీరును ప్ర‌శంసించాలి.

నటీనటులు:
గ్యాంగ్ స్ట‌ర్ గా.. బ్లాక్ టికెటింగ్ కుర్రాడిగా శ‌ర్వా న‌ట‌న ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో శ‌ర్వా ఎమోష‌న‌ల్ పెర్పామెన్స్ ఆక‌ట్టుకుంది. కాజ‌ల్ న‌ట‌న అంద‌చందాలు.. క‌ళ్యాణి క్యూట్ లుక్ మైమ‌రిపించాయి. ఇత‌ర పాత్ర‌లు ఓకే.

టెక్నికాలిటీస్:
ద‌ర్శ‌కుడిగా సుధీర్ వ‌ర్మ కొత్త ప్ర‌య‌త్నం చేసినా కొన్ని త‌ప్పులు చేసి దొరికిపోయాడు. ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. దివాకర్ మణి కెమెరా పనితనం సన్నివేశాలు తెరపై రిచ్ గా చూపించింది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్ ని పెంచాల్సి ఉంది. మూవీలో చాలా అనవసర సన్నివేశాల్ని తొల‌గించ‌లేద‌న్న‌ భావన కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్:

* ఎంచుకున్న క‌థాంశం.. నేప‌థ్యం
* న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌.. ఇంటెన్సిటీ
* గ్యాంగ్ స్టర్ పాత్ర‌

మైనస్ పాయింట్స్:

* స్క్రీన్ ప్లే లోపాలు
* స‌న్నివేశాల్లో గ్రిప్ లేక‌పోవ‌డం
* స్లో నేరేషన్

ముగింపు:
స్టైలిష్ ఎటెంప్ట్.. ఫెయిల్యూర్ గ్యాంగ్ స్టర్ మూవీ

రేటింగ్:
2.5/5