నాన్ ఖాన్స్.. రికార్డ్స్ బ్రేకింగ్..!

Last Updated on by

బాలీవుడ్ లో ఏం రికార్డ్ సృష్టించాలన్నా ఖాన్స్ కే సాధ్యం. ఇప్పుడు షారుక్ ఖాన్ కాస్త వెన‌కున్నాడు కానీ ముందున్న రికార్డుల‌న్ని అమీర్, స‌ల్మాన్ ఖాన్ పేర్ల మీదే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 300 కోట్ల మార్క్ దాటిన సినిమాలు కొన్నే ఉన్నాయి. అందులో అమీర్ పీకే.. దంగ‌ల్.. స‌ల్మాన్ టైగ‌ర్ జిందా హై, సుల్తాన్, భ‌జ‌రంగీ భాయీజాన్ ఉన్నాయి. బాహుబ‌లి 2 512 కోట్ల‌తో అన్నింటికంటే ముందుంది. ఖాన్స్ కు కాకుండా ఈ రికార్డులు మిగిలిన హీరోల‌కు సాధ్యం కాద‌నే భావ‌న ప్రేక్ష‌కుల్లో కూడా వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు ఇది త‌ప్ప‌ని నిరూపిస్తున్నాడు ర‌ణ్ బీర్ క‌పూర్.

ఐదేళ్ల కిందే ఖాన్స్ కు ద‌డ పుట్టించిన ఈ హీరో.. ఇప్పుడు సంజూతో రికార్డుల‌తో చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఇండియాలో 300 కోట్ల క్లబ్ లో నాన్ ఖాన్స్ రికార్డ్ చేరుకుంటున్న‌ది ర‌ణ్ బీరే. ఇప్ప‌టికే 290 కోట్లు వ‌సూలు చేసిన సంజూ.. రేపోమాపో 300 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఖాయం. దాంతోపాటు టైగ‌ర్ జిందా హై.. భ‌జ‌రంగీ భాయీజాన్ రికార్డులు కూడా తుడిచేసేలా క‌నిపిస్తుంది సంజూ. 335 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి సుల్తాన్ ముందుంది కానీ లేదంటే అది కూడా చెరిగిపోవ‌డం ఖాయ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ద్బావ‌తి మాత్ర‌మే నాన్ ఖాన్స్ మూవీస్ లో ఇండియాలో 250 కోట్లు దాటింది. ఇప్పుడు తాను ఉన్నానంటూ ర‌ణ్ బీర్ వ‌చ్చాడు. రాజ్ కుమార్ హిరాణికి ఇది రెండో 300 కోట్ల సినిమా. పికేతో ఈయ‌నే ఈ క్ల‌బ్ కు శ్రీ‌కారం చుట్టాడు. మొత్తానికి రికార్డులు కావాలంటే ఖాన్స్ తో ప‌నిలేద‌ని నిరూపిస్తున్నాడు ర‌ణ్ బీర్ క‌పూర్.

User Comments