సంజూ.. 247 నాటౌట్..!

Last Updated on by

ఒక్క వారం కూడా కాలేదు అప్పుడే 250 కోట్ల‌కు చేరువ‌గా వ‌సూలు చేసింది సంజూ. బాలీవుడ్ లో ఉన్న పాత రికార్డుల‌న్నింటినీ తుడిచి పెట్టేస్తూ కొత్త రికార్డుల‌కు అంకురార్ప‌ణ చేస్తూ దున్నేస్తున్నాడు సంజూ బాబా. రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన ఈ ఎమోష‌నల్ బ‌యోపిక్ కు ప్రేక్ష‌కులు విప‌రీతంగా క‌నెక్ట్ అయిపోయారు. ఎంత‌లా అంటే ఇప్ప‌టికీ రోజుకు క‌నీసం 20 కోట్లు ఇచ్చేంత‌గా. వీక్ డేస్ లో ఒక్క రోజులో ఇన్ని కోట్లు రావ‌డం ఈ మ‌ధ్య కాలంలో అయితే చూడ‌లేదు. అప్పుడెప్పుడో దంగ‌ల్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో బాలీవుడ్ లో ఓ సినిమా దుమ్ము రేపుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో కేవ‌లం ఆరు రోజుల్లోనే 187 కోట్లు వ‌సూలు చేసి.. ర‌ణ్ బీర్ క‌పూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా ఉన్న ఏ జ‌వానీ హై దివానీ ఫుల్ ర‌న్ వ‌సూళ్లు దాటేసింది సంజూ.

ఈ చిత్ర దూకుడు చూస్తుంటే ఈజీగా 400 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ వారం బాలీవుడ్ లో సినిమాలేవీ లేవు. వ‌చ్చినా అన్నీ చిన్న సినిమాలే. దాంతో సంజూకు తిరుగులేకుండా పోయింది. రెండో వారంలో కూడా క‌నీసం 100 కోట్లు వ‌సూలు చేసేలా క‌నిపిస్తున్నాడు సంజూ. ఇదే జ‌రిగితే బాలీవుడ్ లో మ‌రో కొత్త చ‌రిత్ర‌కు రాజ్ కుమార్ హిరాణి నాందీ ప‌లికినట్లే. ఇప్ప‌టికే ఈ ద‌ర్శ‌కుడి ఖాతాలో 3 ఇడియ‌ట్స్ తొలి 200 కోట్ల సినిమాగా.. పీకే తొలి 300 కోట్ల సినిమాగా రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు సంజూ ఎక్క‌డ ఆగుతుందో చూడాలిక‌..!

User Comments