ఆ గ‌ట్టునుంటావా వచ్చేసింది

Last Updated on by

ఈ స‌మ్మ‌ర్ లోనే కాదు.. చూస్తుంటే ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవ‌కాశాలు రంగ‌స్థ‌లంకే ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. మార్చ్ 30న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికే 120 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. గ్రాస్ అయితే 200 కోట్ల‌కు పైగానే ఉంది. తెలుగులో బాహుబ‌లి కాకుండా ఈ రికార్డ్ అందుకున్న ఏకైక సినిమా ఇదే. సినిమా వ‌చ్చి ఆరు వారాలు అవుతున్నా.. ఇప్ప‌టికీ వీకెండ్స్ లో షేర్స్ వ‌సూలు చేస్తుంది రంగ‌స్థ‌లం. ఇకిప్ప‌డు ఫైన‌ల్ ర‌న్ కు ద‌గ్గ‌రగా వ‌చ్చేసింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రంలోని పాట‌ల‌ను కూడా ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే ఎంత స‌క్క‌గున్నావే.. రంగ‌మ్మ మంగ‌మ్మ పాట‌లు విడుద‌ల‌య్యాయి. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది.

ఇక ఇప్పుడు ఆ గ‌ట్టునుంటావా పాట విడుద‌లైంది. దీనికి ఓ క‌థ ఉంది. ఈ చిత్రంలోని పాట‌ను దేవీ శ్రీ ప్ర‌సాద్ పాడాడు. కానీ ఆల్బ‌మ్ లో మాత్రం ఈ పాట‌ను జాన‌ప‌ద గాయ‌కుడు శివ‌నాగులుతో పాడించాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. అక్క‌డే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. సినిమాలో ఏదో టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ తో శివ‌నాగులు వాయిస్ తీసేసి.. దేవీ వాయిస్ పెట్టామ‌ని చెప్పాడు సుకుమార్. ఈ విష‌యంలో త‌న‌కు చిన్న ఇన్ఫ‌ర్మేష‌న్ కూడా ఇవ్వ‌లేద‌ని శివ‌నాగులు చెప్పాడు. ఆల్బ‌మ్ తో పాటు సినిమాలో దేవీ పాడిన పాట కూడా సూప‌ర్ హిట్ అయింది. అయితే ఎక్కువగా శివ‌నాగులు పాట‌కే క‌నెక్ట్ అయ్యారు ప్రేక్ష‌కులు. దాంతో సుకుమార్ కూడా ఇది కావాల‌ని చేసింది కాద‌ని.. టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల‌తోనే వాయిస్ రీప్లేస్ చేయాల్సి వ‌చ్చింద‌ని క్లారిటీ ఇచ్చాడు. ఎప్ప‌టికీ ఆల్బ‌మ్ లో మాత్రం శివ‌నాగులు వాయిస్ ఉంటుంద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఇప్ప‌టికే మూడు పాట‌లు వ‌చ్చాయి. ఇక మూడు పాట‌లు బ్యాలెన్స్. అవి కూడా వ‌చ్చేస్తే అమేజాన్ లో రంగ‌స్థ‌లం ఒరిజిన‌ల్ ప్రింట్ కూడా మ‌రో 10-15 రోజుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఖాయం.

User Comments