రంగ‌స్థ‌లం అవార్డు నూర్‌కి అంకితం

రంగ‌స్థ‌లం సినిమాకు గాను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  బిహైండ్ వుడ్ గోల్డ్  మెడ‌ల్ అవార్డును చెన్నైలో అందుకున్నారు. చ‌ర‌ణ్ స‌తీమ‌ణితో క‌లిసి ఈ అవార్డుకు హాజ‌ర‌య్యారు. అయితే ఈ అవార్డును రెండు రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందిన గ్రూట‌ర్ హైద‌రాబాద్ చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు నూర్ అహ్మ‌ద్ భాయ్ కి అంకితమిచ్చారు.

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. మ‌న‌మంతా అభిమానుల వ‌ల్లే ఎంతో సంతోష‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నా మ‌న్నారు. నాన్న‌ని, న‌న్ను 12 ఏళ్ల‌గా ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు. అలాంటి వ్య‌క్తి ఈరోజు మ‌న లో లేడు. నాకు ఈ అవార్డు ఆయ‌నే ఇచ్చిన‌ట్లు ఉంది. మేం మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్నాం స‌ర్. ఉయ్ మిస్ యు అని భావోద్వేగానికి గుర‌య్యాడు. ఈ కార్య‌క్ర‌మంలో  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌, సాయి ప‌ల్ల‌వి, ధ‌నుష్‌, య‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.