రంగస్థలంను ఆపడం కష్టం

Last Updated on by

నాలుగు వారాలైంది రంగ‌స్థ‌లం వ‌చ్చి.. కానీ ఇప్ప‌టికీ ఆడుతూనే ఉంది. ఏ వారానికి ఆ వారం కొత్త సినిమాలు వ‌స్తున్నాయి కానీ త‌న దూకుడు మాత్రం త‌గ్గించ‌డం లేదు చిట్టిబాబు. చివరికి భ‌ర‌త్ అనే నేనుతో మ‌హేష్ బాబే వ‌చ్చినా కూడా రంగ‌స్థ‌లం ర‌చ్చ ఆగ‌లేదు. నాలుగో వారం కూడా ఈ చిత్రం నాలుగు కోట్ల షేర్ వ‌సూలు చేసిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లు తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాకు ఇంత పాజిటివ్ టాక్ వ‌చ్చి చాలా ఏళ్లైపోయింది. అలా వ‌స్తే క‌లెక్ష‌న్లు ఎలా వ‌స్తాయో రంగ‌స్థ‌లం చూపించింది. తొలివారం 80 కోట్ల షేర్.. రెండో వారం 19 కోట్ల షేర్.. మూడో వారం 9 కోట్ల షేర్.. నాలుగోవారం  4 కోట్ల షేర్.. ఇలా ప్ర‌తీ వారం వ‌సూళ్లు రాబ‌డుతూ త‌న ఉనికి చాటుకుంటున్నాడు చిట్టిబాబు.

రంగస్థలం ఇప్పటి వరకు 180 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చిట్టిబాబు దెబ్బ‌కు రెండో వారం నితిన్.. మూడో వారంలో నాని బ‌లైపోయారు. మ‌హేష్ పెద్ద హీరో కాబ‌ట్టి నిల‌బ‌డ్డాడు పైగా సినిమాకు టాక్ కూడా బాగానే వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం 115 కోట్ల షేర్ పైగా వ‌సూలు చేసింది. నాలుగో వారంలోనూ ఈ చిత్రం కోసం మ‌రో 20 స్క్రీన్లు అద‌నంగా యాడ్ చేసారు. తెలంగాణలో అయితే ఇప్ప‌టికే 25 కోట్ల షేర్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఈ రికార్డ్ అందుకున్న తొలి సినిమా ఇదే. మ‌రోవైపు థియేట‌ర్ ఓన‌ర్స్ కూడా షోస్ నిండ‌క‌పోతే మ‌రో ఆలోచ‌న లేకుండా రంగ‌స్థ‌లం న‌డిపించేస్తున్నారు. ఓవ‌ర్సీస్ లో కూడా 3.5 మిలియ‌న్ వైపు ప‌రుగులు తీస్తుంది రంగ‌స్థ‌లం. చూడాలిక‌.. ఈ దూకుడు ఎక్క‌డ ఆగుతుందో..?

User Comments