రేర్‌ రికార్డ్ బ్రేక్ చేసిన చెర్రీ

Last Updated on by

రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` నాన్ బాహుబ‌లి రికార్డుల్ని తిర‌గ‌రాసిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సిరీస్ మిన‌హాయిస్తే, టాలీవుడ్‌లో నంబ‌ర్- 1 సినిమా ఏది అంటే `రంగ‌స్థ‌లం` ప్ర‌స్థావ‌నే వ‌స్తోంది. ఈ సినిమా నైజాంలో ఏకంగా 30 కోట్ల వ‌సూళ్ల‌తో చ‌రిత్ర సృష్టించింది. ఒక ర‌కంగా ఇది ర‌జ‌నీకాంత్ `రోబో` తెలుగు రాష్ట్రాల ఓవ‌రాల్ వ‌సూళ్ల‌కు స‌మానం. ఇలాంటి అరుదైన ఫీట్ చెర్రీకే సాధ్య‌మైంది.

ఇప్పుడు చ‌ర‌ణ్ మ‌రో రేర్ రికార్డును బ్రేక్ చేసి ఔరా! అనిపించాడు. ఇన్నాళ్లు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మ‌హేష్ `పోకిరి` రికార్డు సుస్థిరంగా ఉంది. పోకిరి దాదాపు 12ఏళ్ల క్రితం రిలీజై హైద‌రాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రూ.1,61,43,081 (1.61కోట్లు) వ‌సూలు చేసింది. ఇప్పుడు 12 ఏళ్ల త‌ర‌వాత ఆ రికార్డును బ్రేక్ చేస్తూ `రంగ‌స్థ‌లం` ఏకంగా 1.62కోట్లు వ‌సూలు చేసింది. ఆ మేర‌కు ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్ ట్రేడ్ వివ‌రాలు అందించింది. ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం అమెజాన్ ప్రైమ్‌లో లైవ్‌కి ఉంది. అయినా క్రాస్‌రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ 35ఎంఎం థియేట‌ర్‌లో స్థిర‌మైన క‌లెక్ష‌న్ల‌తో రంగ‌స్థలం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మెగాభిమానులు ప‌దే ప‌దే ఈ సినిమాని వీక్షించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డంతో ఈ రేర్ ఫీట్ సాధ్య‌మైంది.

User Comments