న‌డుమొంపుల‌తో చంపేస్తున్న స‌మంత‌

స‌మంత ఇప్ప‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్ళ‌వుతుంది. అప్పుడెప్పుడో కెరీర్ మొద‌ట్లో ఆమె చాలా మాయ చేసింది. కానీ ఆ త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాల జ‌డిలో సాధార‌ణ హీరోయిన్ అయిపోయింది. మ‌ళ్లీ ఇన్నేళ్ళ త‌ర్వాత రంగ‌స్థ‌లంలో త‌న లుక్ తో ప‌డేస్తుంది ఈ మాయ‌లేడి. ముఖ్యంగా న‌డుము ఒంపుల‌తో నాట్య‌మాడేస్తుంది ప్రేక్ష‌కుల గుండెల‌తో. మొన్న విడుద‌లైన రామ‌ల‌క్ష్మీ టీజ‌ర్ లోనూ అమ్మాయిగారి న‌డుము ఒంపులే హైలైట్. ఇక ఇప్పుడు ఏం స‌క్క‌గున్నావే అంటూ ఇప్పుడు ఓ పాట విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 13 సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ పాట రానుంది. ఈ పాట స్టిల్ లో కూడా త‌ల‌పై గ‌డ్డివాము పెట్టుకుని వ‌య్యారంగా న‌డుస్తూ అంద‌రి చూపులు త‌న‌వైపు తిప్పుకుంటుంది స‌మంత‌. కైపెక్కించే చూపులతో అంద‌ర్నీ మాయ చేస్తుంది ఈ భామ‌.

Rangasthalam Samantha Attire in Yentha Sakkagunnave Song

కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ లేనంత‌ మాస్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది స‌మంత‌. ఈమె పేరు కూడా రామ‌ల‌క్ష్మి అంటూ ప‌క్కా మాస్ పేరునే ఎంచుకున్నాడు సుకుమార్. ఈ పాత్ర‌పై కూడా ప్ర‌త్యేక దృష్టి పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. రామ్ చ‌ర‌ణ్ చెవిటి వాడు అయితే.. స‌మంత మూగ‌మ్మాయి అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. వీళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ సినిమాకు మెయిన్ హైలైట్స్ లో ఒక‌టి. స‌మంత‌, రామ్ చ‌ర‌ణ్ ను మార్చేసిన తీరు చూసి సుకుమార్ కు అంతా ఫిదా అయిపోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్ చూస్తుంటే సినిమాపై ఆస‌క్తి అలా పెరిగిపోతుంది. ఫిబ్ర‌వ‌రి 13న రంగ‌స్థ‌లంలోని తొలి పాట విడుద‌ల కానుంది. మ‌రి ఈ పాట ఎంత సంచ‌ల‌నం సృష్టిస్తుందో..? మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది.

User Comments