బికినీ సమంత అయింది రామలక్ష్మి

Last Updated on by

మొదట్లో రంగస్థలం సినిమా పై అంత హైప్ లేదు. లొకేషన్ ఫొటోస్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాను ఎంత కేర్ తీసుకొని చేస్తున్నారో అర్ధం అయింది. ఇప్పుడు రంగస్థలం సినిమా ట్రేండింగ్ లో ఉంది. సుకుమార్ ఈ చిత్రంలో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా చిత్రీకరిస్తున్నారని తెలిసిందే. అయినా ఫ్యాన్స్ లో ఏక్కడో చిన్న అనుమానం ఉండేది సినిమా ఎలా వస్తుందో అని. అప్పుడు ఆ డౌట్స్ కి చెక్ పెట్టడానికి చిట్టి బాబు టీజర్ తో వచ్చాడు. అప్పుడు తెలిసింది సుకుమార్ ఎక్కడ తప్పు చేయట్లేదు అని. టీజర్ లో రామ్ చరణ్ ని చూపించిన విధానం అండ్ చిట్టి బాబు పవర్ అందరికి నచ్చింది. రంగస్థలం చరణ్ టీజర్ యు ట్యూబ్ లో ఇప్పటి వరకు కోటి మందికి పైగా చూసారు. ఇందులో చరణ్ చెవిటి క్యారెక్టర్ చేస్తున్నాడు.

తర్వాత ఇంకో డౌట్ వచ్చింది సమంత ఫ్యాన్స్ కి. మరి మా స్యామ్ ఎలా ఉంటుందో అని. దానికి కూడా చెక్ పెట్టడానికి సుకుమార్ అండ్ టీం టీజర్ రెడీ చేపించారు. సమంత తన ట్విట్టర్ ద్వారా రామ లక్ష్మి టీజర్ ని విడుదల చేసింది. అయ్యో రామలక్ష్మి అంటే రంగస్థలం సినిమాలో స్యామ్ పేరు. టీజర్ మొత్తం చరణ్ వాయిస్ ఓవర్ సమంత విజువల్స్ తో ఉంది. టీజర్ లో రామలక్ష్మి వయ్యారంగా నడిచే షాట్ తో స్టార్ట్ చేశారు. చాలా అమాయకమైన ఎక్సప్రెషన్స్ తో సమంత మాయ చేసింది. టీజర్ చూస్తున్న మనమే రామలక్ష్మి మాయలో పడిపోతున్నారు మరి సినిమాలో చిట్టి బాబు గుండె కాయని ఎంత గోల పెట్టించిందో. అన్నట్టు ఇందులో రామ లక్ష్మిది మూగ క్యారెక్టర్ అని సమాచారం.

User Comments