రంగస్థలంతో మహానటి.. తప్పదు పోటీ

చెప్పే క‌థ మాత్ర‌మే కొత్త‌గా ఉండాలి.. నేప‌థ్యం కాదు. ఇప్పుడు మ‌న ద‌ర్శ‌కులు ఇదే చేస్తున్నారు. పాత క‌థ‌లనే కొత్త‌గా చెబుతున్నారు. పాత క‌థ అంటే రొటీన్ క‌థ అని కాదు అర్థం.. పాత కాలం నేప‌థ్యం ఉన్న క‌థ అని అర్థం. అంటే కొన్ని ద‌శాబ్ధాల పాటు వెన‌క్కి వెళ్లే క‌థ అన్న‌మాట‌. ఇప్పుడు రంగ‌స్థ‌లం తీసుకోండి.. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర నేప‌థ్యం 30 ఏళ్ల కింద ఉంటుంది. ఈ క‌థ మొత్తం 80ల్లోనే జ‌రుగుతుంది. అప్పుడు రంగ‌స్థ‌లం అనే ఓ ఊళ్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లే ఈ సినిమా. సినిమాకు అన్ సీజ‌న్ గా భావించే మార్చ్ లో ఈ సినిమా విడుద‌ల కానుంది. అదే టైమ్ లో వ‌ర‌స‌గా సినిమాలు తీసుకొస్తున్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ ధైర్యం ఏంటో కానీ వ‌ర‌స రోజుల్లో సినిమాలు విడుద‌ల చేస్తున్నారు. మార్చ్ వార్ ను ముందు తెర‌తీసింది మాత్రం రామ్ చ‌ర‌ణే. ఈయ‌న రంగ‌స్థ‌లం మార్చ్ 30న వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ స్టార్ హీరో చేయ‌ని సినిమా రంగ‌స్థ‌లం. ఎందుకంటే ఇందులో హీరోకు చెవులు విన‌బడ‌వు. మాస్ ఇమేజ్ ఉండి కూడా చర‌ణ్ చేస్తోన్న ఈ ప్ర‌యోగానికి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

Rangasthalam Vs Mahanati

ఇక చ‌ర‌ణ్ కంటే ఒక్క‌రోజు ముందు మార్చ్ 29న మ‌హాన‌టి రానుంది. ఇది కూడా ఇప్ప‌టి క‌థ కాదు. సావిత్రి జీవితం అంటేనే కొన్ని ద‌శాబ్ధాలు వెన‌క్కి వెళ్లాల్సిందే. 1950ల్లోంచి క‌థ మొద‌లు పెట్టాలి. నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై ఆస‌క్తి బాగానే ఉంది. సినిమాను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి కూడా లేదు. కీర్తిసురేష్, స‌మంత కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు. దాంతో సినిమాపై అంచ‌నాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్ర‌ల‌ను డిజిట‌ల్ గ్రాఫిక్స్ తో చూపించ‌బోతున్నారు. ఇక ఎస్వీ రంగారావుగా మోహ‌న్ బాబు న‌టిస్తున్నారు. అలాగే సినిమాలో చాలా పాత్ర‌ల‌ను ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ న‌టులు పోషిస్తున్నారు. మ‌హాన‌టి ఖచ్చితంగా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతుంద‌ని చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఈ చిత్రం కోసం మూడేళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఇటు రామ్ చ‌ర‌ణ్.. అటు నాగ్ అశ్విన్ వ‌చ్చేస్తున్నారు. అది కూడా వ‌ర‌స రోజుల్లోనే. మ‌రి వీళ్ల జాత‌కం ఎలా ఉండ‌బోతుందో..?

User Comments