మూర్ఖులా మీకేం తెలుసు!

అక్కాచెల్లెళ్లు రంగోలీ, కంగ‌నా ర‌నౌత్ లో ఫైరింగ్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌నేమైనా అంటే చెల్లెలు..చెల్లిని ఏమైనా అంటే అక్క నోరేసుకుని మీద ప‌డిపోతార‌ని విధిత‌మే. తాజాగా పాత క్ష‌క్ష‌ని దృష్టిలో పెట్టుకుని మ‌రోసారి బాలీవుడ్ ప్రేమ పావురాలు ర‌ణ‌బీర్ క‌పూర్-అలియా భ‌ట్ పై రంగోలీ సెటైర్లు గుప్పించింది. గ‌తంలో మ‌ణిక‌ర్ణిక షూటింగ్ కోసం కంగ‌న గుర్ర‌పు స్వారీ నేర్చుకోలేద‌ని..డ‌మ్మి గుర్రం మీద‌నే న‌టించింద‌ని ఓ వీడియో వైల‌ర్ అయింది. దాన్ని లీక్ చేసింది ఈ ప్రేమ పావురాలేన‌ని ఆరోప‌ణ‌లు చేసింది రంగోలి.

తాజాగా బ్ర‌హ్మాస్ర్త సినిమా కోసం అలియా, ర‌ణ‌బీర్ గుర్ర‌పు స్వారీ ఏస్తోన్న ఫోటోల‌ను పోస్టూ చేసి..ఈ ఇద్ద‌రు మూర్ఖులు( అలియా, ర‌ణ‌బీర్) త‌మ కొత్త సినిమా కోసం గుర్ర‌పు స్వారీ నేర్చుకోవ‌డానికి వెళ్లారు. కానీ ఒక్క రోజుకే అల‌సి పోయారు. మ‌ళ్లీ ప్ర‌య‌త్నించ‌లేదు. కానీ నా సోద‌రి స్వారీ నేర్చుకుంటూ మూడుసార్లు కింద ప‌డింది. ఎన్నో గాయాలు అయ్యాయి. అయినా వాటిని లెక్క చేయ‌కుండా శ్ర‌మించింది. సినిమా అవ‌కాశాలు కోసం బ‌య‌టి నుంచి వ‌చ్చిన వారి ఈ మూర్ఖులు క‌ష్ట‌ప‌డ‌లేరంటూ తెలిపింది. చివ‌రిగా త‌ప్పుగా మాట్లాడి ఉంటే నిరూపించండ‌ని రెచ్చ గొట్టే వ్యాఖ్య‌లు చేసింది అక్క‌మ్మ‌.