రాణి శివగామి ఎమోష‌న‌ల్ జ‌ర్నీ

బాహుబ‌లి సంచ‌ల‌నాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. తెలుగు సినిమా ద‌శ దిశ మార్చేసిన సినిమా ఇది. ఇందులోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాణి శివ‌గామి పాత్ర ప్రాధాన్య‌త తెలిసిందే. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ క్వీన్ గా సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌కు అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడు మ‌రోసారి రాణి శివ‌గామి ఈజ్ బ్యాక్ ఎగైన్. ర‌మ్య‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో తెర‌కెక్కుతున్న తాజా సినిమా `రాణి శివ‌గామి`. మ‌ధు.ఎం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ముర‌ళీకృష్ణ నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేసి సెన్సార్ కి రెడీ అవుతోంది.

ద‌ర్శ‌కుడు మ‌ధు మాట్లాడుతూ-“9వ శతాబ్ధంలో రాణికి.. 21వ శతాబ్ధంతో ఉన్న క‌నెక్ష‌న్ ఏమిటి? అన్న‌దే మా సినిమా లైన్. హార‌ర్ ఫిక్ష‌న్ డ్రామా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. రాణి శివ‌గామి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపిస్తారు. నీలాంబ‌రి(న‌ర‌సింహా) త‌ర‌హాలో మ‌రోసారి అదిరిపోయే పాత్ర‌లో న‌టించారు. త‌ను క‌నిపిస్తే ప్ర‌తి స‌న్నివేశం యాక్ష‌న్ మోడ్ లో ఉద్విగ్న‌త పెంచుతుంది. కామెడీ..ల‌వ్‌.. ఎమోష‌న్.. మైథాల‌జీ ఇలా ప‌లు కోణాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో కొత్త‌త‌రం హీరోలు న‌టించారు. తొలి కాపీ రెడీ. తెలుగు సెన్సార్ చేయాల్సి ఉంది. తెలుగు-త‌మిళం-క‌న్న‌డ‌లో రిలీజ్ చేయ‌నున్నాం. మీడియా.. సినీరంగాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉంది. ద‌ర్శ‌కుడిగా తొలి చిత్ర‌మిది. మీ ఆశీస్సులు కావాలి“ అని తెలిపారు. నిర్మాత‌లు మాట్లాడుతూ-“కుటుంబ స‌మేతంగా మెప్పించే అన్ని అంశాల క‌ల‌యిక‌తో వ‌స్తున్న ఈ సినిమా త‌ప్ప‌నిస‌రిగా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. త్వ‌ర‌లో సినిమాని రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు. ర‌మ్య‌కృష్ణ‌, ప్రవీణ్ తేజ్, పాయ‌ల్, ర‌వి కాలే, గోలిసోడా కీర్తి మధు, అవినాష్‌, రోలర్ రఘు, మ‌ధుమ‌ణి, మిమిక్రీ రితేష్, రంగ‌న్న త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సంగీతం: వీర్ సమర్త్, కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటర్: కె.ఎం.ప్రకాష్, ఫైట్స్: థ్రిల్లర్‌మంజు, అల్టిమేట్ శివ, ఆర్ట్ : బాబు ఖాన్, విఎఫ్ఎక్స్ & సిజి: జెమిని ల్యాబ్ హైదరాబాద్, డిఐ- జెమిని ల్యాబ్ హైదరాబాద్,  నిర్మాత‌: మురళీ కృష్ణ, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: మధు.