ర‌ణ్ వీర్ టెంప‌ర్ చూసారా..?

Last Updated on by

కొన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ కాక‌పోవ‌చ్చు కానీ అందులో కంటెంట్ మాత్రం బ్లాక్ బ‌స్ట‌రే. ఎన్టీఆర్ టెంప‌ర్ కూడా అలాంటి క‌థే. చీక‌ట్లో ఉన్న ఎన్టీఆర్ కెరీర్ కు మార్గం చూపించిన సినిమా ఇది. టెంప‌ర్ త‌ర్వాతే ఈయ‌న వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్నాడు. ఎన్టీఆర్ లో అంత పెద్ద న‌టుడున్నాడ‌నే విషయం మ‌రోసారి చూపించిన సినిమా అది. ఇలాంటి సినిమాను రీమేక్ చేయాలన్నా.. అందులో న‌టించాల‌న్నా ఆ హీరోకు, ద‌ర్శ‌కుడికి చాలా గ‌ట్స్ ఉండాలి. ఇప్పుడు హిందీలో ర‌ణ్ వీర్ సింగ్.. త‌మిళ్ లో విశాల్ కు ఆ ద‌మ్ము త‌మ‌కు ఉందంటున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌ను మ‌రిపించ‌లేక‌పోయినా.. అలా ట్రై చేస్తానంటున్నాడు ర‌ణ్ వీర్ సింగ్. ఈయన‌కు తోడుగా రోహిత్ శెట్టి ఉన్నాడు.

ఈ చిత్రానికి సింబా అనే టైటిల్ పెట్టాడు రోహిత్ శెట్టి. ఇక్క‌డే చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు రోహిత్ శెట్టి. తెలుగులో ఎంతో సీరియ‌స్ గా సాగే ఈ చిత్రాన్ని హిందీలో కామెడీ చేస్తున్నాడా అనే అనుమానం రాక మాన‌దు ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే. రోహిత్ కూడా ఈ చిత్ర థీమ్ మాత్ర‌మే తీసుకుని.. టెంప‌ర్ రీమేక్ ను పూర్తి ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తానంటున్నాడు. అలా చేస్తే సోల్ మిస్సై.. సినిమాకు ఎక్క‌డ దెబ్బ ప‌డుతుందో అని కంగారు ప‌డుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే ఇప్పుడు విడుద‌లైన స్టిల్స్ చూస్తుంటే మాత్రం టెంప‌ర్ ఉన్న‌ది ఉన్న‌ట్లే దించేస్తున్న‌ట్లు తెలుస్తుంది. సీరియ‌స్ గా పోలీస్ స్టేష‌న్ మెట్ల‌పై కూర్చుని ఉన్న ర‌ణ్ వీర్ ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇవి చూస్తుంటే పెద్ద‌గా రిస్క్ తీసుకుంటున్న‌ట్లు అనిపించ‌డం లేదు. 2018 డిసెంబ‌ర్ 28న సింబా విడుద‌ల కానుంది.

User Comments