పూరి ఏడ్చిన అరుదైన క్ష‌ణం

Last Updated on by

ఎవ‌రైనా ఏడ్చేంత ప‌రిస్థితి ఎప్పుడు వ‌స్తుంది?  తాను దారుణంగా మోస‌పోయిన‌ప్పుడు.. లేదా ఆస్తుల్ని న‌ష్ట‌పోయిన‌ప్పుడు, అనూహ్యంగా త‌న‌వారిని కోల్పోయిన‌ప్పుడు… త‌న‌కు ఇష్ట‌మైన‌దానిని వ‌దులుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు..ఏడ్వాల్సిన స‌న్నివేశం వ‌స్తుంది. అలాంటి సంద‌ర్భాల్లో ఏ ఒక్క‌టైనా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌కి ఎదురైందా? అంటే అవున‌ని ఆయ‌నే అంగీక‌రించారు. ప్ర‌స్తుతం ఆకాష్ పూరి న‌టించిన `మెహ‌బూబా` రిలీజ్ ప్ర‌చారంలో ఉన్న పూరి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను వ‌ల‌వ‌ల ఏడ్చేసిన స‌న్నివేశం ఒక‌టి త‌న జీవితంలో ఉంద‌ని టాప్ సీక్రెట్‌ని లీక్ చేశారు. అస‌లింత‌కీ ఏమా సంద‌ర్భ ం అంటే.. అదే రియ‌ల్ వెంచ‌ర్‌.

పూరి జ‌గ‌న్నాథ్  కెరీర్ ప‌రంగా పీక్స్‌లో ఉన్న‌ప్పుడు ఓ పెద్ద ఝ‌ల‌క్ తిన్నారు. ఆయ‌న‌ను న‌మ్మిన‌వారే రియ‌ల్ వెంచ‌ర్ పేరిట‌ న‌ట్టేట ముంచారు. ఆ స‌మ‌యంలో ఉన్న డ‌బ్బు అంతా కోల్పోయి తాను ఆస్తులు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి కూడా త‌లెత్తింద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. త‌న సొమ్ముల‌న్నీ తెలిసిన వారికి ఇచ్చి తిరిగి రాక దారుణంగా న‌ష్ట‌పోయాన‌ని పూరి ఇదివ‌ర‌కూ తెలిపారు. అయితే అందులో నిజం ఎంత‌? అని ప్రెస్సోళ్లు ఆరాతీసిన ప్ర‌తిసారీ పూరి అవును అది నిజ‌మేన‌ని అంగీక‌రించారు. మెహ‌బూబా ప్ర‌చారంలోనూ ఆయ‌న మ‌రోసారి గ‌తాన్ని గుర్తు చేసుకుని న‌మ్మిన‌వారు మోసం చేసి ముంచేసిన‌ప్పుడు తీవ్ర‌మైన వ్య‌థ‌తో ఏడ్చేశాన‌ని అన్నారు. ఇక త‌న‌యుడు ఆకాష్‌ని హీరోగా పెట్టి సినిమా చేసేందుకు ఎవ‌రూ ముందుకు రార‌ని తెలిసి తానే సొంత ఇళ్ల‌లో ఒక‌దానిని అమ్ముకుని మెహ‌బూబా చిత్రం తీశాన‌ని తెలిపారు. ఇక త‌న కెరీర్ ప‌రాజ‌యాల బాట‌లో ఉన్న‌ప్పుడు తాను ఫోన్ చేస్తే .. వీడెందుకు చేశాడ్రా బాబూ అనుకున్న వాళ్లు ఉన్నార‌ని త‌న అనుభ‌వాన్ని వివ‌రించారు. మొత్తానికి పూరి ఏడ్చేసిన ఆ అరుదైన క్ష‌ణం.. పూరి ఇల్లు అమ్ముకున్న ఆ రేర్ మూవ్‌మెంట్ జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనివి అన‌డంలో సందేహం లేదు.

User Comments