ఎఫైర్ గోల‌కి భ‌య‌ప‌డి అలా చేసింది!

బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్- ర‌ష్మి మ‌ధ్య ర్యాపో గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ స్కిట్ల‌ కన్నా వాళ్లిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ షోలో ర‌క్తి క‌ట్టిస్తుంది.  యాంక‌రింగ్ లో ఈ జోడీకి ప్ర‌త్యేక‌ గుర్తింపు ఉంది. ఆ ఐడెంటీనే ప‌లుమార్లు రూమ‌ర్ల‌కు దారి తీసింది. ఆ ఇద్ద‌రు  ప్రేమ‌లో ఉన్నార‌ని, పెళ్లి చేసుకోబోతున్నార‌ని హ‌ద్దులు మీరిన క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు క్లారిటీ ఇచ్చినా ఆ క‌థ‌నాల‌కి మాత్రం పుల్ స్టాప్ ప‌డ‌లేదు. ఆ విష‌యం ప‌క్క‌న బెడితే  సుధీర్ సాప్ట్ వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ నేప‌థ్యంలో యూనిట్ ప్ర‌చారం వేగ‌వంతం చేసింది. ఇందులో సుధీర స‌ర‌స‌న ధ‌న్య బాల‌కృష్ణ‌న్ న‌టించింది. సుధీర్ కు ఫెయిర్ గా  ధ‌న్య‌కు బ‌ధులుగా ర‌ష్మీనే తీసుకుంటే బాగుండేది?  సినిమాకి ప్ల‌స్ అయ్యేద‌ని  చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఇద్ద‌రి క్రేజ్ సినిమాకు బాగా క‌లిసొచ్చేద‌ని భావించారు.  కానీ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల ఛాయిస్ మ‌రో హీరోయిన్ అయింది. మ‌రి దీనికి కార‌ణం ఏమిటి అన్న‌ది అన్వేషించ‌గా ఆస‌క్తిక‌ర రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.  తొలుత ఈ ఛాన్స్ ర‌ష్మికే వ‌చ్చింద‌ట‌. కానీ ఆమె కాద‌నుకుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న పుకార్లు నేప‌థ్యంలో  క‌లిసి సినిమా చేస్తే అవి మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని? ఆ రూమ‌ర్లు కార‌ణంగా మానసిక వ్య‌ధ‌కు గుర‌వ్వాల‌ని భావించి వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.  అలాగే ర‌ష్మి టీవీ షోల‌కే స‌మ‌యం కేటాయించ‌లేనంత‌ బిజీగా ఉందిట‌. ఒక చిన్న సినిమాకు వ‌చ్చే పారితోషికం క‌న్నా రెగ్యుల‌ర్  గా చేసే  షోలు ప‌క్క‌న‌బెట్ట‌డం సరికాద‌ని వృత్తిప‌ట్ల అంకిత భావం చూపించింద‌ని అంటున్నారు. ర‌ష్మి `గుంటూరు టాకీస్` సినిమాతో హీరోయిన్ గా పరిచ‌య‌మైన సంగ‌తి  తెలిసిందే.