చైతూతో ర‌ష్మిక… ఇది ఫిక్స్‌

ర‌ష్మిక మంద‌న్న మ‌రో మంచి అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది. ఈసారి ఆమె నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించ‌బోతోంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా `నాగేశ్వ‌ర‌రావు` అనే చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇందులో క‌థానాయిక‌గా ర‌ష్మిక మంద‌న్న‌ని ఎంపిక చేసుకున్నారు. ప‌ర‌శురామ్ నిర్ణ‌యం మేర‌కే ర‌ష్మికని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. `గీత గోవిందం`తో ర‌ష్మిక‌కి తిరుగులేని హిట్టు ఇచ్చాడు ప‌ర‌శురామ్‌. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండించ‌డంలో ప‌ర‌శురామ్ విజ‌య‌వంత‌మ‌య్యారు. `గీత గోవిందం` త‌ర్వాతే ర‌ష్మిక కెరీర్ తెలుగులో ఊపందుకుంది. అందుకే ఆమె బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, బోలెడ‌న్ని అవ‌కాశాలు చేతిలో ఉన్న‌ప్ప‌టికీ ప‌ర‌శురామ్ కోరిక మేర‌కు వెంట‌నే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింద‌ట‌. ప్ర‌స్తుతం చైతూ న‌టిస్తున్న `ల‌వ్‌స్టోరీ` పూర్త‌వ్వ‌గానే `నాగేశ్వ‌ర‌రావు` సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ని స‌మాచారం.