బాలీవుడ్ దిగ్గ‌జంతో ర‌ష్మిక మండ‌న‌

క‌న్న‌డ భామ రష్మిక మండ‌న ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఛ‌లో`, `గీత‌గోవిందం`, `దేవ‌దాస్` ల‌తో బ్యాక్ టు బ్యాక్ స‌క్స‌స్ లంద‌కుని త‌న‌కంటూ ప్రత్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకుంది. యువ‌త‌లోనూ అమ్మ‌డికి అదే రేంజ్ లో ఓ ఫాలోయింగ్ ఉంది. అమ్మ‌డి అందానికి ఫిదా కాని కుర్రాడు లేడు. ఆక్రేజే టాప్ స్టార్ చిత్రాల వైపు తీసుకెళ్లింది. ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యూత్ స్టార్ నితిన్, అక్కినేని అఖిల్ స‌ర‌స‌న న‌టించేందుకు సంత‌కాల చేసింది. అటు కోలీవుడ్ లోనూ వెళ్లూనే కార్తీ స‌ర‌స‌న ఛాన్స్ అందుకుంది. తాజాగా ఈ అందానికి బాలీవుడ్ ఎర్ర తివాచి వేసి మ‌రీ ఆహ్వానం ప‌లుకుతోంది. ఆరంభ‌మే బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భాన్సాలీ సినిమాలో ర‌ష్మిక ఛాన్స్ అందుకుంద‌న్న వార్న టాలీవుడ్ మీడియాను ఊపేస్తోంది.

సంజ‌య్ లీలా ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఒక్క‌సారైనా న‌టించాల‌ని క‌ల‌లు కంటారు. భారీ పారితోషికాలు సైతం తిర‌గిచ్చేసి సంజ‌య్ సినిమాకు ఒకే చెప్పిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ది ర‌ష్మిక‌కి ఆ న‌యా డైరెక్ట‌ర్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడుట‌. సంజ‌య్ లీలా సినిమాల‌ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న సినిమాలంటే దేశంలోనే ఓ బ్రాండ్. ప్రేమ క‌థ‌లు చేయాల‌న్నా, చారిత్ర నేప‌థ్యంగ గ‌ల సినిమాలు అన్నా ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధించిన సినిమా చ‌రిత్ర ఆయ‌న సొంతం. మ‌రి ర‌ష్మిక‌తో భ‌న్సాలి ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడో చూద్దాం.

Also Read: Balayya’s Heroine Crossing All The Limits Of Hotness