రష్మిక పెళ్ళికి ఛలో

ఛీ పోరా.. ఇప్పుడు ఛ‌లో సినిమా చూసిన వాళ్ల‌కు ఈ డైలాగ్ బాగా గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో హీరోనే కాదు.. త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను కూడా బాగానే డిస్ట‌ర్బ్ చేసింది ర‌ష్మిక మండన్న‌. ఈ క‌న్న‌డ క‌స్తూరి ఇప్పుడు తెలుగ‌మ్మాయి అయిపోయింది. సినిమాలో త‌మిళ పొన్నుగా న‌టించి.. తెలుగు కుర్రాళ్ల‌కు నిద్ర దూరం చేసింది ర‌ష్మిక‌.

Rashmika Mandanna Magic Recreate After Sai Pallavi పైగా సొంత వాయిస్ కావ‌డంతో మ‌రింత హైలైట్ అయింది ఈ ముద్దుగుమ్మ‌. ఫేస్ లోనే ఎక్స్ ప్రెష‌న్స్ ప‌లికిస్తూ పిచ్చెక్కించింది ర‌ష్మిక‌. ఒక్కోసారి ఒక్క సినిమా కూడా విడుద‌ల కాకుండానే కొంద‌రు హీరోయిన్ల‌కు కావాల్సినంత ఇమేజ్ వ‌స్తుంటుంది. ఆ మ‌ధ్య సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు ర‌ష్మిక మండన్న విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఛ‌లో రాక‌ముందే ఈ భామ పేరు మార్మోగిపోయింది.

Rashmika Mandanna Magic Recreate After Sai Pallaviఇప్పుడు ఛలో విడుదలైంది ఇందులో అమ్మ‌డి ప‌ర్ఫార్మెన్స్ కూడా పిచ్చెక్కించింది. దాంతో ర‌ష్మిక పేరు తెలుగులో మార్మోగిపోతోంది. క‌న్న‌డ‌నాట కిరిక్ పార్టీ త‌ర్వాత వ‌ర‌స‌గా స్టార్ హీరోలతో న‌టించింది ఈ భామ‌. ఈ చిత్ర షూటింగ్ న‌డుస్తున్న స‌మ‌యంలోనే హీరో క‌మ్ డైరెక్ట‌ర్ రక్షిత్ శెట్టి తో ప్రేమలో ప‌డిపోయింది. పడిపోవడం వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిపోవడం అన్నీ ఫాస్ట్ గా జరిగిపోయాయి. పెళ్లికి మాత్రం టైం తీసుకోవాలనే ఆలోచనలో ఉంది రష్మిక. ఇదిలా ఉండ‌గానే తెలుగులో కెరీర్ కూడా బాగానే ప్లాన్ చేసుకుంటుంది.

Rashmika Mandanna Magic Recreate After Sai PallaviRashmika Mandanna Magic Recreate After Sai Pallavi

ఇప్ప‌టికే ఇక్క‌డ నాగ‌శౌర్య‌తో న‌టించిన ఛ‌లో ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌లైంది. దీనికి సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చేసింది. దాంతోపాటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనూ ఓ సినిమాలో న‌టిస్తుంది ర‌ష్మిక మండన్న‌. తెలుగులో మ‌రో రెండు సినిమాల్లోనూ ర‌ష్మిక‌ను తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. వ‌ర‌స సినిమాల‌తో తెలుగులోకి చాలా సైలెంట్ గా వ‌చ్చేస్తుంది ఈ కిర్రాక్ హీరోయిన్. మ‌రి టాలీవుడ్ లో ఈ భామ మాయ ఎంత‌వ‌ర‌కు కొన‌సాగుతుందో.