Last Updated on by
ఛలో, గీత గోవిందం చిత్రాలతో బ్లాక్బస్టర్లు అందుకుంది రశ్మిక మందన. ఆ క్రమంలోనే తన తొలి చిత్ర కథానాయకుడు, దర్శకుడు రక్షిత్ తో నిశ్చితార్థం కుదుర్చుకుని మరీ అతడి నుంచి విడిపోతోందంటూ ప్రచారం సాగింది. మొన్నటికి మొన్న రశ్మిక తల్లి సైతం దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పెళ్లి ఉండబోదని వివరణ ఇవ్వడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే దీనిపై రక్షిత్ అభిమానులు, కన్నడిగులు చాలా సీరియస్ అయ్యారు. టాలీవుడ్ కి వెళ్లాక రశ్మిక ఆలోచనల్లో ఎంతో మార్పు వచ్చిందని కొందరు తిట్టి పోశారు. దీంతో తీవ్రంగా హర్టయిన రశ్మిక సామాజిక మాధ్యమాల్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
నిన్న రాత్రి ఉన్నట్టుండి రశ్మిక ఓ ఉద్వేగపూరితమైన ట్వీట్‌ని చేసింది. “అన్నీ చూస్తున్నా.. చాలా డిస్ట్రబ్ అయ్యాను. నాపై సాగించిన ఈ ప్రచారం ఇబ్బంది పెట్టింది. అయినా కానీ నేనెవరితోనూ వాదించదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం చెబుతాను. రక్షిత్ కానీ, నేను కానీ ఇంకెవరైనా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కానీ ఇలాంటి సన్నివేశం ఎదుర్కోవద్దు. కాయిన్‌కి రెండు వైపులు ఉన్నట్టే ప్రతి ఒక్కరి జీవితంలో అలా రెండు వైపులు ఉంటాయి. కాబట్టి మా పనిని మమ్మల్ని చేసుకోనివ్వండి. ప్రశాంతంగా బతకనివ్వండి. చివరికి నేను చెప్పదలిచినది వినండి. నేను కన్నడ సినిమాలు చేస్తాను. నేను ఉన్నది పరిశ్రమలో పని చేసేందుకే. అన్ని భాషల్లోనూ నటిస్తాను. అన్ని సినిమాల్లో నాకు తోచినంత బెస్ట్‌గా నటిస్తాను. థాంక్యూ“ అంటూ ఉద్వేగంగా స్పందించింది రశ్మిక. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. తాను ఎంతగా హర్టయిందో!
User Comments