కార్తీ స‌ర‌స‌న గీత గోవిందం గీత‌!

Last Updated on by

గీత గోవిందం గీత‌గా తెలుగు యువ‌త గుండెల్లో నిలిచింది ర‌ష్మిక మంద‌న‌. ఛ‌లో, గీత గోవిందం చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని తెలుగు, త‌మిళంలో బిజీ నాయిక‌గా మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా సౌత్ స్టార్ హీరో కార్తీ స‌ర‌స‌న ఈ భామ అవ‌కాశం ద‌క్కించుకుంది. ఖాకీ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది.

కార్తీ 19 వ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న పాత్ర విభిన్నంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య తో ఎన్ జీకె, కార్తీ తో ఖైదీ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం – వివేక్ – మెర్విన్, ఎడిటింగ్ – అంతొనీ, సినిమాటోగ్రఫీ – సత్యన్ సూర్యన్.

User Comments