గుమ్మం ముందుకే స‌న్నబియ్యం

ఆంధ్రప్రదేశ్ లోని తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికి ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తామని ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన సంచుల నమూనాలు సిద్ధం అయ్యాయి. 5,10,20 కేజీల బస్తాల్లో సన్నబియ్యాన్ని ఇకపై లబ్ధిదారుల ఇంటికి నేరుగా సరఫరా చేయనున్నారు. ఈ సంచులపై ముఖ్యమంత్రి జగన్, చిరునవ్వులు చిందిస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖచిత్రాలను ముద్రించారు. ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో ఈ నమూనా సంచులను ప్రదర్శించనున్నారు.