ర‌వితేజ‌ 66 వ సినిమా సెట్స్‌కి

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వ‌చ్చింది. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించినున్న 66వ సినిమా వివ‌రాలను అధికారికంగా ప్ర‌క‌టించారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఆర్.టి66 అంటూ అధికారికాంగా ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి గోపీ చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఠాగూరు మ‌ధు నిర్మిస్తున్నట్లు రివీల్ చేసారు. గ‌తంలో గోపీచంద్ మ‌లినేని-ర‌వితేజ కాంబినేష‌న్ లో దుబాయ్ శీను, బ‌లుపు చిత్రాలు క‌మ‌ర్శియ‌ల్ గా మంచి విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఆ న‌మ్మ‌కంతోనే 66వ సినిమా బాధ్య‌త‌ల్ని మాస్ రాజా పూర్తిగా గోపీచంద్ కి అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈకాంబో సినిమా చేయాల‌ని రెండేళ్లుగా అనుకుంటోంది. కానీ ర‌వితేజకి ఉన్న‌ ఇత‌ర క‌మింట్మెంట్ల వ‌ల్ల వీలుప‌డ‌లేదు. ఎట్ట‌కేల‌కు మూడో సారి చేతులు క‌లుపుతున్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ వి. ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `డిస్కోరాజా`లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనంత‌రం ర‌వితేజ 66వ ప‌ట్టాలెక్క‌నుంది. వ‌చ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.